గాడ్ ఫాదర్ టైటిల్ వివాదం.. మెగాస్టార్ కోసం ఏదైనా ఇచ్చేస్తా: సీటిమార్ దర్శకుడు
చాలా రోజుల తర్వాత ఒక బిగ్ యాక్షన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కిన సిటిమార్ సినిమా శుక్రవారం వినాయక చవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల అయ్యింది. మాస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంటుందని ఒక టాక్ అయితే వస్తోంది. అయితే ఈ దర్శకుడు కూడా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసేలా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేత బెస్ట్ విషెస్ కూడా అందుకున్నాడు. సిటీ మార్ ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్ సబ్యులకు మెచ్చుకున్నారు. సినిమాను చూడాలని అనిపిస్తుంది అని కూడా ఆయన దర్శకుడిపై ప్రశంసలు కురిపించాడు.
అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ టైటిల్ విషయంలో కొంత రభస జరిగినట్లుగా ఒక టాక్ అయితే వచ్చింది. ఆ విషయంపై కూడా ఇటీవల దర్శకుడు సంపత్ నంది ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేశాడు. దర్శకుడు సంపత్ నంది పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసి అనంతరం ఏమైంది ఈవేళ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక రెండో అవకాశం తోనే రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేశాడు. ఆ మూవీ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాల అనంతరం రవితేజతో బెంగాల్ టైగర్ చేసినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఆ గోపీచంద్ తో చేసిన మొదటి సినిమా గౌతమ్ నంద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే లాభాలు లేకపోయింది.

అయితే మధ్యమధ్యలో సంపత్ నంది మెగా హీరోలకు కూడా టచ్ లోనే ఉంటున్నాడు. అనంతరం మళ్లీ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం అయితే రాలేదు. కానీ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక తరువాత తన దగ్గర ఉన్న ఒక మాస్ యాక్షన్ కథ కోసం గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను సంపత్ నంది రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఆ టైటిల్ విషయంలో మెగా నిర్మాతలకు ఈ దర్శకుడికి మధ్య కొంత రభస జరిగినట్లుగా పుకార్లు వచ్చాయి.
కానీ ఆ విషయంలో సంపత్ నంది ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక్క మాట తోనే క్లారిటీ ఇచ్చేశాడు. ఆ విషయంపై ఇప్పుడే స్పందించలేను గాని మెగాస్టార్ కోసం మాత్రం ఒక టైటిల్ ఏమిటి ఎలాంటి స్క్రిప్ట్ అయినా కూడా అలా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆయన స్ఫూర్తి తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగిందని అన్నాడు. అంతేకాకుండా సిటీ మార్ సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేకంగా అభినందించడం ఎంతగానో బూస్ట్ ఇచ్చిందని వివరణ ఇచ్చాడు. ఇక భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా రామ్ చరణ్ మెగాస్టార్ వంటి వారితో సినిమా చేయడానికి తప్పకుండా సిద్ధం అవుతానని సంపత్ నంది మరో క్లారిటీ అయితే ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











