మెగా హీరోకు పోలీసుల నోటీసులు.. లీక్ చేసిన స్టార్ డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో మెగా కుటుంబం నుంచి దాదాపు డజను మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి లాంచింగ్ జరిగినా తమ సొంత కష్టం, ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ మెగా ఫ్యామిలీకి ఎలాంటి మచ్చ లేకుండా చూసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లోకే వస్తారు మెగా మేనల్లుడు సాయిథరమ్ తేజ్. తాజాగా ఈ హీరోకి పోలీసులు నోటీసులు పంపారంటూ దర్శకుడు సంపత్ నంది చెప్పడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది. దీని వెనుక ఏం జరిగిందో పరిశీలిస్తే.

మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయ దుర్గ కుమారుడైన సాయి థరమ్ తేజ్.. చెన్నై, హైదరాబాద్‌లలో చదువుకున్నాడు. అనంతరం మేనమామల ప్రోత్సాహంతో సినీ రంగం వైపు అడుగులు వేశారు సాయితేజ్. 2014లో పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి సాయిథరమ్ తేజ్ తొలి సినిమాతోనే నటన, లుక్స్, డ్యాన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ, చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బతుకే సో బెటర్, రిపబ్లిక్, విరూపక్ష, బ్రో వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సత్య అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ , సంబరాల ఏటి గట్టు అనే చిత్రంలోనూ సాయిథరమ్ తేజ్ నటిస్తున్నారు.

director sampath nandi s key announcement on sai dharam tej s gaanja shankar movie

సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న సాయితేజ్ లైఫ్‌లో 2021 సెప్టెంబర్ 10న జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుదుపు కుదిపింది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సాయితేజ్ కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలు కావడంతో తొలుత మెడికవర్ ఆసుపత్రిలో తర్వాత జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొద్దిరోజుల తర్వాత కోలుకున్న సాయిథరమ్ తేజ్ .. విరూపక్ష , బ్రో చిత్రాలతో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు.

ఈ క్రమంలో తన పేరును సాయి థరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్‌గా మార్చుకున్నారు. తన తల్లి విజయ దుర్గ పేరులోని దుర్గని తీసుకుని సాయి దుర్గ తేజ్‌గా మార్చుకుంటున్నట్లు సత్య సినిమా ప్రెస్ మీట్‌లో తెలిపారు. ఇలా చేయడం వల్ల తన తల్లి ఎప్పుడూ తనతోనే ఉన్నట్లుగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా.. విరూపక్ష, బ్రో సినిమాల తర్వాత సంపత్ నంది దర్శకత్వంతో సాయితేజ్ ఓ సినిమాను అనౌన్స్ చేశారు. అదే గాంజా శంకర్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా.. ఏడాది కావొస్తున్నా గాంజా శంకర్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీనిపై చిత్ర సీమలో రకరకాల పుకార్లు వస్తుండగా దర్శకుడు సంపత్ నంది కీలక వ్యాఖ్యలు చేశారు. సాయిథరమ్ తేజ్‌తో చేయాలనుకున్న గాంజా శంకర్‌ను ఆపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టైటిల్ మార్చుకోకమని సాయిథరమ్ తేజ్‌కు, నిర్మాత నాగవంశీకి , నాకు పోలీసులు నోటీసులు పంంపారని.. అయితే టైటిల్ మార్చడం కంటే సినిమాను ఆపివేయడమే మంచిదనే ఉద్దేశంతో గాంజా శంకర్‌ను నిలిపివేసినట్లు సంపత్ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X