సందీప్ రెడ్డి ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం.. రెండోసారి తండ్రి అయిన డైరెక్టర్
అర్జున్ రెడ్డి చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజీ డైరెక్టర్‌గా మారిన సందీప్ రెడ్డి వంగా ఇంట్లో ఆనందం నెలకొన్నది. సందీప్ రెడ్డి దంపతులు ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇప్పటికే వారికి కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. మీడియా వివరాల ప్రకారం.. సందీప్ రెడ్డి భార్య బుధవారం రోజున పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. సందీప్ రెడ్డి భార్య, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిట్టితల్లి రాకతో మా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది అని పేర్కొన్నారు.
అర్జున్ రెడ్డి చిత్రానికి ముందు సందీప్ రెడ్డికి ఓ కుమారుడు ఉన్నారు. తన కుమారుడు అర్జున్ రెడ్డి పేరునే తన మొదటి చిత్రానికి టైటిల్‌గా పెట్టుకోవడం విశేషం. అర్జున్ రెడ్డి చిత్రం సందీప్ రెడ్డిని జాతీయ స్థాయికి చేరేలా చేసింది.

తెలుగులో అర్జున్ రెడ్డి తర్వాత కొద్ది గ్యాప్ అనంతరం హిందీలో అదే చిత్రాన్ని రీమేక్ చేయడం తెలిసిందే. తెలుగులో మాదిరిగానే హిందీలో కూడా అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది. వివాదాలతో మొదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందడం తెలిసిందే.
కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మరోసారి ప్యాన్ ఇండియా మూవీని రూపొందించే పనిలో సందీప్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. మహేష్ లేదా ప్రభాస్ లేదా హిందీలో ప్రముఖ హీరోతో సినిమాను చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











