Sandeep Reddy Vanga: "నిన్ను నా సినిమాలో పెట్టుకుని తప్పు చేశా.. అలా చేసి మీ గిల్ట్ పోగడతా"
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2017లో విజయ్ దేవరకొండ, శాలినీ పాండేలు హీరోహీరోయిన్లుగా ఈయన తీసిన చిత్రం అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమాకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. తొలి సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న వంగా.. అది చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. కబీర్ సింగ్ గా తెరకెక్కించగా.. విపరీతమైన గుర్తింపు వచ్చింది. అయితే ఆ చిత్రంలో పాల్గొన్న ఓ నటుడిపై తాజాగా సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన్ను సినిమాలోకి తీసుకుని తప్పు చేశానంటూ ఆవేదన చెందారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ హిట్టవడంతో 2019లో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. కబీర్ సింగ్ పేరుతో ఈ సినిమాని రీమేక్ చేయగా.. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. 2019 జూన్ 21వ తేదీన విడుదల అయిన ఈ సినిమాలో ఆదిల్ హుస్సేన్, నిఖితా దత్, టీనా సింగ్, సోహం మజుందార్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే ఈ సినిమా హిందీలోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో.. అందులోని నటీనటులు అందరికీ మంచి పేరు వచ్చింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ కబీర్ సింగ్ సినిమాపై షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఆ సినిమా చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయినట్లు చెప్పారు. తాను ఈ చిత్రంలో కాలీజ్ డీన్ గా వ్యవహరించానని.. పాత్ర బాగుందని చేశానని తెలిపాడు. కానీ సినిమా విడుదల అయ్యాక మాత్రం చాలా ఫీల్ అయ్యానని.. సినిమా కూడా పూర్తిగా చూడకుండా మధ్యలోంచి వచ్చేసినట్లు వివరంచాడు. అంతేకాకుండా ఆ సినిమాను తన భార్యను చూడొద్దని కూడా చెప్పినట్లు తెలిపాడు.
అంతేకాకుండా ఈ పాత్రకు తాను ముందుగా నో చెప్పినట్లు ఆదిల్ హుస్సేన్ వివరించారు. అయితే పదే పదే ఈ ఆఫర్ తో తన వద్దకు రావడం, తాను అడిగినంతా ఇస్తాననడంతో సినిమాకు ఓకే చెప్పానని.. చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపించిందని ఆదిల్ హుస్సనే వివరించారు. అయితే ఆయన చేసిన కామెంట్లపై తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి స్పందించారు. మిమ్మల్ని నా సినిమాలో తీసుకున్నందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నానని వివరించారు. మీరు గొప్పగా భావించి చేసిన 30 సినిమాలు తెచ్చి పెట్టలేని పేరు మీగు రీగ్రెట్ గా ఫీల్ అవుతున్న ఈ బ్లాక్ బస్టర్ సినిమా తెచ్చిపెట్టిందని అన్నారు.

అలాగే మీకు సినీ రంగంపై ఉన్న పాషన్ కంటే కూడా దూరాశే ఎక్కువని సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా వివరించారు. మీ ముఖాన్ని ఏఐ ద్వారా నా సినిమాలో మార్చేస్తానని.. ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. బాగా నవ్వుకోండి అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసేయండి.


Click it and Unblock the Notifications











