స్పిరిట్ విలన్ కన్ఫమ్.. తొలిసారిగా స్పందించిన సందీప్ రెడ్డి వంగ
పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ ఇండియాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపుదిద్దుకోవలసిన చిత్రం స్పిరిట్. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమాలో నటీనటుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ తాజాగా స్పిరిట్ విలన్ పాత్ర ఎవరు చేస్తున్నారనే దానిపై తొలిసారిగా స్పందించారు.
హీరోయిన్ విషయంలో కాంట్రవర్సీ..
స్పిరిట్ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో దీపికా పదుకొనే పేరు గట్టిగా వినిపించండి. అందుకు తగ్గట్టుగానే సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను సంప్రదించారు. అయితే ఆమె ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం ఆ మధ్య కొంత వివాదాస్పదమైంది. రెమ్యునరేషన్, కొన్ని సీన్ల విషయంలో దీపికా పదుకొనే నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

దీపికా పదుకొనే సందీప్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో వెంటనే యానిమల్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన త్రిప్తి డిమ్రినీ హీరోయిన్గా అనౌన్స్ చేశారు. తృప్తి డిమిరిని తీసుకోవడంతో స్పిరిట్ చిత్రానికి చాలా బడ్జెట్ కలిసి వచ్చిందని, ఇక ఆమె కథకు అనుగుణంగా నటించేందుకు కూడా సిద్ధపడిందని వెళ్లడైంది. ఇక దీంతో హీరోయిన్ కు సంబంధించిన కాస్టింగ్ పూర్తయింది. ఆ తర్వాత స్పిరిట్ విలన్ ఎవరు అంటూ చర్చ జరుగుతూ వస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ చిత్రంలో విలన్ గా అమెరికన్ యాక్టర్ డాన్ లీ నటించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సమయంలో తాజాగా సందీప్ రెడ్డి వంగ స్పందించడం ఆసక్తికరంగా మారింది. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ జిగర్ అనే చిత్రం ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ స్పిరి చిత్రంలో విలన్ ఎవరు అంటూ కొందరు ప్రశ్నించారు. మరికొందరు డాన్లీని ఎంపిక చేయాలని అడిగారు.
అందుకు సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ సమాధానం ఇచ్చారు. మీరు అనుకున్నట్టే జరుగుతుంది. 'అట్లనే అవుద్ది' అని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ కు ధీటైనా విలన్ గా ఉండాలని, వారిని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చూడాలని ఎంతగానో ఆశించారు. ఇక ఫ్యాన్స్ కోరిక స్పిరిట్ చిత్రంతో తీరబోతుండటం విశేషం. ఈ చిత్రం 2025 అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంతో జగపతి బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ప్రభాస్ చివరిగా సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక నెక్ట్స్ రాజా ది సాబ్, ఫౌజీ చిత్రాలు రాబోతున్నాయి. ఇప్పటికే రాజా ది సాబ్ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











