రాజమౌళికి అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఛాలెంజ్.. ఆ పోస్ట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
లాక్ డౌన్ కారణంగా బాహ్య ప్రపంచానికి దురమైనప్పటికి సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు బోలెడంత ఫన్ దొరుకుతోంది. సెలబ్రెటీలు ఛాలెంజ్ లతో అందరికి ఎదో ఒక టాస్క్ ఇస్తున్నారు. మొన్నటివరకు పోలిటీషియన్స్, హీరో హోరోయిన్స్ వంటి వారు ఎక్కువగా ఛాలెంజ్ లతో రచ్చ చేయగా ఇప్పుడు టాలీవుడ్ దర్శకులు కూడా మొదలుపెట్టారు.
లాక్ డౌన్ సమయంలో ఇళ్ళల్లోనే ఉంటూ ఎదో ఒక పని చేయడం బెటర్ అని నడుము వంచుతున్నారు. ముందుగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా #BetheREALMAN హ్యాష్ ట్యాగ్ తో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో సందీప్ తన ఇంట్లో రోజు పని మనిషి చేసే పనులన్నీ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో డొమెస్టిక్ వర్క్ విషయంలో స్త్రీలకు తప్పకుండా సహాయపడేలా ఉండాలని ట్వీట్ చేశారు.

Recommended Video
అదే విధంగా ఈ వీడియో డైరెక్టర్ రాజమౌళికి కుడా ఛాలెంజ్ విసరగా ఆయన వెంటనే స్పందించారు. తప్పకుండా సందీప్.. అంటూ రేపే హోమ్ వర్కవుట్ కి సంబంధించిన పోస్ట్ చేస్తానని వివరణ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం వీరి ఛాలెంజ్ ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి. అలాగే రాజమౌళి ఎలాంటి వీడియో రిలీజ్ చేస్తాడా అని ఆడియెన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











