శేఖర్ కమ్ముల ప్లాన్ వర్కౌట్ అవుతుందా!
శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలు లేకుండానే సినిమాని విజయపథంలో నడిపించగలరు. ఫిదా చిత్రంతో శేఖర్ కమ్ముల తన సత్తా నిరూపించుకున్నాడు. ఫిదా తరువాత మళ్ళీ రొమాంటిక్ లవ్ స్టోరీతోనే శేఖర్ కమ్ముల ఒక చిత్రాని తెరకెక్కిస్తున్నాడు. అంతా కొత్తవారితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఆసక్తి పెంచడానికి శేఖర్ కమ్ముల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హీరో, హీరోయిన్లని ఇప్పట్లో మీడియాకి పరిచయం చేయకూడదని శేఖర్ కమ్ములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రయోగాన్ని గతంలో గుణశేఖర్ వరుడు చిత్రం విషయంలో చేశాడు. హీరోయిన్ ని నేరుగా సిల్వర్ స్క్రీన్ పైనే చూపించారు. ఆ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు శేఖర్ కమ్ముల అదే తరహా పద్దతి ఫాలో అవుతుండడం ఆసక్తిగా మారింది.

శేఖర్ కమ్ముల చిత్రాలకు భారీ హంగులు ఉండవు. సింపుల్ గా సినిమాతీసి ఆడియన్స్ ని మెప్పిస్తారు. ఆనంద్, హ్యాపీడేస్, ఫిదా చిత్రాలు అలా విడుదలై విజయం సాధించినవే. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











