twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీపై స్పందించిన శంకర్.. పెద్ద తప్పు జరిగిపోయింది అంటూ..

    |

    సంచలన దర్శకుడు శంకర్‌పై ఇటీవల నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా ఆయన అభిమానులను ఈ న్యూస్ ఆశ్చర్యానికి గురి చేసింది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే కూల్ డైరెక్టర్ శంకర్ ఊహించని విధంగా ఓ కేసులో సమస్యల్లో చిక్కుకోవడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారినట్లు తమిళ్ మీడియాలో వార్తలు వచ్చాయి. చెన్నైలోని ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేశారు. ఇక ఫైనల్ గా ఒక పొరపాటు జరిగిందని దర్శకుడు శంకర్ స్పందించారు.

     రోబో కథ.. కాపీ వివాదం

    రోబో కథ.. కాపీ వివాదం


    రోబో కథ కారణంగానే దర్శకుడు శంకర్ మరోసారి సమస్యల్లో ఇరుక్కున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి. 'జిగుబా' అనే పుస్తకం కథ ఆధారంగా కథను కాపీ కొట్టినట్లు గతంలోనే చాలా ఆరోపణలు వచ్చాయి. శంకర్‌ 'రోబో' చిత్రం తనదే అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా విషయం హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది.

    కేసు నమోదు..

    కేసు నమోదు..


    రోబో సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఆ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ్ లో కూడా అత్యదిక వసూళ్లను అందుకుంది. అయితే ఆ సినిమాను అరుర్‌ తమిళ్‌నందన్‌ రచించిన 'జిగుబా' కథను కాపీ కొట్టినట్లు సినిమా విడుదలైన సనయంలోనే కేసు నమోదైంది.

    అసలు కథ ఆ నవల లోనిదే..

    అసలు కథ ఆ నవల లోనిదే..

    రైటర్ అరుర్‌ తమిళ్‌నందన్‌ రాసిన 'జిగుబా' కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురించారు. అనంతరం ఆ స్టోరీని 2007లో ఓ నవలగా ముద్రించారు. ఇక రోబోలో ఉన్న అసలు కథ తన నవల ఆధారంగానే తెరకెక్కించరని ఆ రచయిత స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం శంకర్‌ను విచారణకు హాజరు కావాల్సిందిగా పలుమార్లు ఆదేశాలు జారీచేసినట్లు కథనాలు వెలువడ్డాయి.

    స్పందించిన శంకర్..

    స్పందించిన శంకర్..

    ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా కూడా శంకర్ నుంచి సమాధానం రాలేదు. అదే విధంగా న్యాయస్థానం ఎదుట కూడా హాజరుకాక పోవడంతో శంకర్ పై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసినట్లు వార్తలు రావడంతో వెంటనే శంకర్ ఆ విషయంపై ఆరా తీశారు. తన లాయర్ కూడా కోర్టును సంప్రదించగా ఎలాంటి వారెంట్ కూడా జారీ కాలేదని శంకర్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

    Recommended Video

    2.0 Hindi Version To Surpass The Lifetime Business Of Robot On The 1st Day Itself | Filmibeat Telugu
    తప్పు జరిగిపోయింది

    తప్పు జరిగిపోయింది


    నిన్నటి వరకు కూడా శంకర్ పై కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసినట్లు వార్తలు గట్టిగానే వచ్చాయి. ఇక శంకర్ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. ఆన్ లైన్ కోర్ట్ రిపోర్టింగ్‌లో జరిగిన ఒక లోపం కారణంగా వలన అలా జరిగిందని శంకర్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే జరిగిన పురపాటును కూడా ఆన్‌లైన్‌లో సరి చేశారని అంటూ.. మీడియా ఎలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని శంకర్‌ విజ్ఞప్తి చేశడు.

    English summary
    Stalwart actor-director duo Kamal Haasan and Shankar’s Indian 2 is facing trouble ever since it went on floors. Earlier this year, after an unexpected sad incident on the sets, the entire crew went under a huge shock. Three people lost their lives and a few members were injured severely
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X