సూర్య హ్యాపీ బర్త్ డే: వయసు పెరిగినా కుర్రాడిలా మారుతున్నాడు.. డైరెక్టర్ శంకర్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్యతోపాటు ప్రముఖ నటుడు మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాట‌ల‌ను ఆదివారం చెన్నైలో విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో ఆర్య, ఆయన సతీమణి, హీరోయిన్ సాయేషా సైగల్ ఆసక్తికరంగా మాట్లాడారు.

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ - చాలా మంచి టీమ్‌కుదిరింది. సూప‌ర్‌హిట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. క‌థ‌, పెర్ఫామెన్స్‌, యాక్ష‌న్‌, విజువ‌ల్స్‌, మ్యూజిక్ ఇలా అన్ని అద్భుతంగా కుదిరాయి. తెర‌పై సూర్య‌, కె.వి.ఆనంద్‌గారి కష్టం క‌న‌ప‌డుతుంది. కె.వి.ఆనంద్‌గారు నా ద‌గ్గ‌ర ప‌నిచేసేట‌ప్పుడు సీన్ బాగా రావ‌డానికి ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు. సూర్య రాను రానూ యువ‌కుడిలా మారుతున్నారు. ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌.. డేడికేష‌న్ ఉన్న న‌టుడు. ఈ సినిమా త‌న‌కు వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మాస్ సినిమాగా నిలిచిపోవాల‌ని కోరుకుంటున్నాను. సుభాస్క‌రన్ లాంటి చక్కటి అభిరుచి ఉన్న ప్రొడ్యూస‌ర్ ఈ సినిమాకు నిర్మాత కావ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌యం. బందోబస్త్' వంటి మంచి చిత్రాల‌ను మ‌రిన్నింటిని ఆయ‌న నిర్మించాల‌ని కోరుకుంటున్నాను. హ్యారీస్ జైరాజ్ సూప‌ర్బ్ మ్యూజిక్ అందించాడు. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

 Director Shankar about Suriya at Kaappaan movie function

కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. బందోబస్త్ (కాప్పాన్) సినిమా గురించి చెప్పాలంటే సుభాస్క‌రన్ గురించి చెప్పాలంటే... ఆయ‌న మ‌న‌కు దేవుడిచ్చిన వ‌రం. ఎందుకంటే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో సగం మంది ఆయన సినిమాల్లోనే ప‌నిచేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్లో 'ఇండియ‌న్‌ 2' సినిమాను చేస్తున్నారు. అది త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. అలాగే 60 ఏళ్లుగా ఎంజిఆర్‌గారి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంద‌రో చేయాల‌నుకుంటున్న 'పొన్నియ‌న్ సెల్వ‌న్' సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నేను, మురుగ‌దాస్‌గారు క‌లిసి చేస్తోన్న 'ద‌ర్బార్' సినిమాను నిర్మిస్తున్నారు అని రజనీకాంత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X