శంకర్.. లోకేష్ కనకరాజ్ అస్టిస్టెంట్‌గా చేరు.. అందుకు కూడా పనికిరావు.. గేమ్ ఛేంజర్ డైరెక్టర్ షాకింగ్ రిప్లై
ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడటం ఎక్కువైంది. భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న సినిమాలుకు కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రావడం లేదు. అట్టర్ ఫ్లాప్ మూవీకి కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతున్నట్లు పోస్టర్స్ వేసుకుంటున్నారని డిస్ట్రిబ్యూటర్లే స్వయంగా వాపోతున్నారు. ఇదంతా తెలిసినా ఎదురు ప్రశ్నించలేదని పరిస్థితుల్లో ఉన్నామని పలువురు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఇక సినిమా కనుక ఫ్లాప్ అయితే సదరు హీరో అభిమానుల చేసే ట్రోలింగ్ దెబ్బకు వణికిపోతున్నారు.
భారీ నష్టాలు మిగిల్చిన గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా, లెజండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా.. కేవలం 190 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా దెబ్బకు నిర్మాత దిల్‌రాజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమా రిజల్ట్‌పై భారీగా చర్చ జరిగింది.

నిర్మాత శిరీష్ క్షమాపణలు
ఎన్నడూ తెరవెనుక ఉండటమే కానీ, ముందుకు రానీ దిల్‌రాజు సోదరుడు శిరీష్ వేదికలపై మైక్ తీసుకుని మాట్లాడటం.. ఏకంగా ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం దుమారానికి కారణమైంది. గేమ్ ఛేంజర్ అంత పెద్ద డిజాస్టర్ అయిన తర్వాత హీరో, దర్శకుడి నుంచి కనీసం ఓదార్చలేదని శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో చరణ్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. మా హీరోను అనవసరంగా ఈ ఇష్యూలోకి లాగుతున్నారని.. అవసరం ఉన్నా లేకున్నా చరణ్ ప్రస్తావన తీసుకొస్తున్నారని వార్నింగ్ ఇవ్వడంతో శిరీష్ క్షమాపణలు చెప్పారు. అయితే దర్శకుడు శంకర్ దాదాపు 7 గంటల ఫుటేజ్ తీసి.. పాటల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కంట్రోల్ చేయడంలో తాను విఫలమైనట్లు దిల్‌రాజు అంగీకరించారు.
శంకర్‌పై ట్రోలింగ్
ఇక శంకర్‌ను మెగా అభిమానులు మామూలుగా అడుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో, టెక్నికల్ వండర్స్‌తో భారతీయ సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకుడిగా శంకర్ ఖ్యాతి గడించారు. భారతదేశం గర్వించదగ్గ అతికొద్దిమంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. కానీ ఇప్పుడు సినిమా మేకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. శంకర్ ఇంకా పాత పద్ధతులు, రోటీన్ ఫార్ములాతోనే సినిమాలు తీస్తుండగా.. యువ దర్శకులు శంకర్‌ను మించి టెక్నాలజీని వాడుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు.
కొత్త సినిమాలపై శంకర్ ఫోకస్
గేమ్ ఛేంజర్ రిలీజై డిజాస్టర్ కావడంతో శంకర్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. కమల్ హాసన్‌తో భారతీయుడు 3తో పాటు ఎస్ వెంకటేష్ రాసిన నవల అధారంగా 1000 కోట్ల బడ్జెట్‌తో వేల్పారి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ విడుదలై 6 నెలలు కావొస్తున్నా ఇంకా శంకర్ మీద సినీ అభిమానులకు కోపం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన మీద ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఓ అభిమాని అదే పనిగా శంకర్‌ను ట్రోల్ చేస్తూనే ఉన్నాడు.
లోకేష్‌కి అసిస్టెంట్‌గా కూడా పనికిరావు
నువ్వు లోకేష్ కనకరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయి అని ఒక నెటిజన్ అంటే.. ఒకప్పుడు నువ్వు లెజండరీ డైరెక్టర్‌వి.. ఇప్పుడు లోకేష్ కనగరాజ్‌కి అసిస్టెంట్‌గా కూడా పనికిరావు. సినిమా అంటే 2.30 గంటల నుంచి 3.30 గంటల డ్యూరేషన్‌లో తీయాలి, దానికి డబుల్ లెంగ్త్ షూట్ చేసి నిర్మాతల డబ్బులు వేస్ట్ చేయొద్దు. ప్రొడ్యూసర్‌ను బలి చేయవద్దు అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
పదే పదే తనను ఉద్దేశించి ట్రోలింగ్ చేస్తుండటంతో శంకర్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో సదరు అభిమాని ట్విట్టర్ ఖాతా నుంచి ఎలాంటి మెసేజ్‌లు రాకుండా బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని కూడా ఆ అభిమాని తన ట్విట్టర్‌లో వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. పర్లేదు శంకర్ సార్ నోటిఫికేషన్ ట్యాబ్‌ని బాగానే చూస్తున్నారని సెటైర్లు వేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











