Game Changer: అసలైన వర్క్ ఫినిష్ చేసిన శంకర్.. ఇక ఫోకస్ మొత్తం దానిపైనే..

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్నా పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం గేమ్ ఛేంజర్‌ గురించి అందరికీ తెలిసిందే. అయితే శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. హాట్ బ్యూటీ కియారా అడ్వానీ కథానాయికగా నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ ను డైరెక్టర్ శంకర్ బయట పెట్టారు.

అదేంటంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్‌ పూర్తి అయినట్లు తెలిపారు. ఈ వర్క్ ఫినిష్ కావాలని నిర్మాత దిల్ రాజు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి అసలైన క్లయిమాక్స్ వర్క్ ఫినిష్ అయ్యింది కాబట్టి ఇంకొన్ని సీన్స్ ను ఆడుతూ పడుతూ ఫినిష్ చేస్కోవచ్చట. ఇక రేపటి నుంచి తన ఫోకస్ అంతా ఇండియా-2 పైకి వెళ్తుందని శంకర్ చెప్పాడు.

Director shankar clarification on game changer movie shoot climax

ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రం కోసం మొత్తంగా రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో అంజలి, కియారా అడ్వాణీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ అంజలి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చెర్రీకి భార్యగా కనిపించబోతున్నారు. హీరో శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారు. సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించ బోతున్నారు.

Director shankar clarification on game changer movie shoot climax

అలాగే అలనాటి టాప్ హీరోయిన్ ఖుష్బూ కూడా ఈ సినిమాలో కనిపింబోతున్నారట. ఆమె తెరపై కనిపించేది కాసేపే అయినా ఆ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా కనిపించినబోతున్న గేమ్ ఛేంజర్ ను తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కానీ పూర్తిగా ఇది తమిళ చిత్రమేనట. తెలుగు సినిమా కోసం క్లోజప్ లలో కొన్ని సీన్లను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. 2024 సమ్మర్ లో ఈ చిత్రం తెరపైకి రానుంది. చూడాలి మరి ఈ చిత్రం ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X