రెండోసారి ఘనంగా పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. వరుడు ఎవరంటే?
డైరెక్టర్ శంకర్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి దేశ వ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే తాజాగా ఆయన పెద్ద కూతురు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను రెండోసారి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం అంగరంగ వైభవంగా సాగగా.. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ కు మొత్తం ముగ్గురు పిల్లలు. అయితే ఇందులో కుమార్తెలు ఉండగా.. ఒక కుమారుడు. పెద్ద కూతురు పేరే ఐశ్వర్యా శంకర్. వృత్తిరీత్యా వైద్యురాలు అయిన ఈమె 2021లో ఆమె క్రికెటర్ రోహిత్ దామోదరన్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో.. ఏడాదిలోగానే విడాకులు తీసుకుని దూరం అయ్యారు. ఇక అప్పటి నుంచి ఈమె తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ అబ్బాయిని ప్రేమించింది. ఆయన మరెవరో కాదు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తరుణ్ కార్తికేయన్.

చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇరుకుటుంబాలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈక్రమంలోనే తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వాళ్లు కూడా ఒప్పుకుని ఘనంగా వీరి వివాహం చేయాలనుకున్నారు. ముఖ్యంగా రెండు నెలల క్రితమే అంటే ఫిబ్రవరిలోనే వీరికి నిశ్చితార్థం కూడా చేశారు. తాజాగా ఈరోజు వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ వివాహనికి అనేక మంది సెలబ్రిటీలు హాజరు అయ్యారు.
ముఖ్యంగా ఐశ్వర్యా శంకర్, తరుణ్ కార్తికేయన్ ల పెళ్లికి.. రజినీ కాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తి, నయనతార, విఘ్నేష్ శివన్, నరేష్ వంటి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. ఇలా అంగరంగ వైభవంగా సాగిన ఈ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నూతన వధూవరులతో పాటు వచ్చిన అతిథిలు కూడా అందంగా ముస్తాబై ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. మీరు కూడా ఓసారి వీరి పెళ్లి ఫొటోలపై ఓ లుక్ వేయండి.

ఇదంతా ఇలా ఉండగా.. డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాను కూడా రూపొందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రాబోతున్న ఈ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టు కొట్టనున్నాయో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











