Game Changer: గేమ్ ఛేంజర్‌పై శంకర్ షాకింగ్ స్టేట్‌మెంట్.. బిత్తరపోతున్న మెగా ఫ్యాన్స్!
ఇటీవల తెలుగు సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ సినిమాల్లో గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన అవైటెడ్ సినిమా "గేమ్ ఛేంజర్" కూడా ఒకటి అని తెలిసిందే. కాగా గత డిసెంబర్ లో పుష్ప 2 ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తే దీని తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా వండర్స్ సెట్ చేస్తుంది అని అనుకున్నారు.
కాగా ఈ సినిమాకి టాక్ లేకుండా కేవలం ఆన్లైన్ ప్రచారం తోనే భారీ ఎత్తున కుట్ర జరిగింది అని అభిమానులు సహా చిత్ర యూనిట్ కూడా వాపోయారు. కాగా రిలీజ్ రోజే ఫుల్ క్లారిటీ కలిగిన ప్రింట్ లీక్ అవ్వడం ఇది విస్తృతంగా ఇండియా వైడ్ ప్రచారం కావడం జరిగింది. సోషల్ మీడియాలో యాప్స్ లో కూడా భారీ ఎత్తున జనాన్ని థియేటర్స్ కి వెళ్లనివ్వకుండా గేమ్ ఛేంజర్ ఫుల్ క్లారిటీ ప్రింట్ ఆన్లైన్ లోనే దొరుకుతుంది అని ప్రచారాలు చేస్తూ అనుకున్న టార్గెట్ ని కొందరు రీచ్ అయ్యారు.

ఇలా థియేటర్స్ లో సినిమాకి పెద్ద దెబ్బ కొట్టడంతో డిజాస్టర్ టాక్ రానప్పటికీ సినిమాని ఆ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి అని ఫ్యాన్స్ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు. కాగా ఇదంతా సినిమా రిలీజ్ కి ముందు కథ అయితే ఇపుడు ఈ సినిమా దర్శకుడు శంకర్ ఇచ్చిన ట్విస్ట్ తో మెగా అభిమానులు నివ్వెరపోయారు. కాగా శంకర్ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాటలు షాకింగ్ గా మారాయి.
గేమ్ ఛేంజర్ కి నేను అనుకున్నట్టుగా పరిస్థితులు అనుకూలించలేదు అని చెబుతున్నారు. తాము మొత్తం 5 గంటల ఫుటేజ్ ని సినిమాలో షూట్ చేశామని కానీ నిర్మాతల రిక్వెస్ట్ మేరకు చాలా కట్ చేసేసి వారికి ఇష్టమైన మేర చేసి రిలీజ్ చేశామని చెప్పుకొచ్చారు. కాగా ఇది మాత్రమే కాకుండా ఆ మొత్తం సినిమాలో చాలా మంచి సన్నివేశాలు తాము ట్రిమ్ చేయాల్సి వచ్చింది. అవుట్‌పుట్ విషయంలో నేను సంతృప్తి చెందలేదు. ఇంకా బెటర్‌గా తీయగలిగి ఉండే వాడిని అని కూడా శంకర్ చెప్పడంతో ఇపుడు సినిమా రిలీజ్ అయ్యాక ఈ మాటలు విని మెగా అభిమానులకి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావట్లేదు.

దీనితో శంకర్ ఇచ్చిన ఈ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించ లేదు అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో సినిమా బాగుంటే ఖచ్చితంగా జనం చూస్తున్నారు. ఇటీవల వచ్చిన చాలా పాన్ ఇండియా సినిమాలు 3 గంటల నుంచి 3 గంటల 20 నిమిషాలకి పైగా కూడా వస్తున్నాయి. అలా గేమ్ ఛేంజర్ ని ప్లాన్ చేసుకున్నా కూడా సరిపోయేది ఏమో.. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం గేమ్ ఛేంజర్ వాంటెడ్ గా తొక్కేయబడింది అని చెప్పక తప్పదు.
ఈ నెగిటివ్ లో కూడా సంక్రాంతి సీజన్లో లో డైలీ లక్షకి పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఇది గమనార్హం. మరి ఎలాగో నష్టాలు తప్పవని ట్రేడ్ లో టాక్ ఉంది. కానీ ఎంత ఎక్కువ వరకు సినిమా వెళ్లి ఆగుతుందో అనేది ప్రశ్నగా మారింది. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి ఫీమేల్ లీడ్ లో నటిస్తే దిల్ రాజు తమ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











