ఇద్దరు స్టార్ హీరోల వారసులతో శంకర్ క్రేజీ ప్లానింగ్!
దర్శకుడు శంకర్ ఆలోచనలు భారీస్థాయిలో ఉంటాయి. ఆయన విజన్ చాలా పెద్దది. అందుకే శంకర్ నుంచి వచ్చే చిత్రాల్లో కూడా అంతే భారీగా ఉంటాయి. ఒక రకంగా ఇండియన్ సినిమాకు భారీ తనాన్ని పరిచయం చేసిన దర్శకుడు శంకర్. అపరిచితుడు, భారతీయుడు, రోబో, 2.0 చిత్రాలు ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీని రూపొందిస్తున్నారు. ఇండియన్ తరహాలోనే ఈ చిత్రం కూడా సందేశాత్మక అంశాలతో తెరకెక్కుతోంది.
ఈ చిత్రం తర్వాత శంకర్ మరో క్రేజీ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు విక్రమ్, విజయ్ వారసులు ధృవ్, జాసన్ సంజయ్ హీరోలుగా శంకర్ ఓ భారీ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శంకర్ ఏ తరహా కథని సిద్ధం చేస్తున్నాడనే విషయం మాత్రం రివీల్ కాలేదు. విక్రమ్ కుమారుడు ధృవ్ ఇప్పటికే అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మలో నటిస్తున్నాడు. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఇంకా వెండి తెర ఎంట్రీ ఇవ్వలేదు.

భారతీయుడు 2 పూర్తయ్యాక వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు 2లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐ,2.0 చిత్రాలు శంకర్ స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. దీనితో భారతీయుడు 2పై శంకర్ ఫోకస్ పెట్టారు.


Click it and Unblock the Notifications











