అపరిచితుడు కథ నాది.. అడ్డుకోవడానికి నీకు హక్కు లేదు: నిర్మాతకు కౌంటర్ ఇచ్చిన శంకర్

సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా బెస్ట్ డైరెక్టర్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్న దర్శకుడు శంకర్ ఇటీవల అపరిచితుడు రీమేక్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన అలా ఎనౌన్స్ చేసిన మరుసటి రోజే నిర్మాత రవిచంద్రన్ ఆ కథపై పూర్తి హక్కులు తనవే అంటూ హెచ్చరిస్తూ లేఖ విడుదల చేయడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక శంకర్ కూడా ఆ విషయంపై రియాక్ట్ అయ్యాడు.

బాలీవుడ్ లో మరో అపరిచితుడు

బాలీవుడ్ లో మరో అపరిచితుడు

అపరిచితుడు సినిమాను బాలీవుడ్ లో మరింత కొత్తగా తెరకెక్కించబోతున్నట్లు శంకర్ ఇటీవల వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. రణ్ వీర్ సింగ్ తో మరో కొత్త తరహా అపరిచితుడిని చూపించబోతున్నట్లు చెప్పారు. అయితే సినిమాను బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ నిర్మించడానికి సిద్ధమయ్యారు.

 పూర్తి హక్కులు తనవే అంటూ

పూర్తి హక్కులు తనవే అంటూ

అయితే అపరిచితుడు సినిమా పూర్తి హక్కులు తనవే అంటూ సీనియర్ నిర్మాత V రవిచంద్రన్ నోటీసులు పంపేందుకు రెడీ అయ్యారు. 2005లో విడుదలైన అపరిచితుడు సినిమాను ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ లో రవిచంద్రన్ నిర్మించారు. రైటర్ సుజాత రాసిన ఆ కథ యొక్క మొత్తం రైట్స్ తమవే అంటూ సినిమా పనులను వెంటనే నిలిపివేయ్యాలని చెప్పారు.

శంకర్ రియాక్షన్..

శంకర్ రియాక్షన్..

ఇక మొత్తానికి శంకర్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. రవిచంద్రన్ చెబుతున్నట్లు సుజాత ఈ కథను రాశారు అనేది పూర్తిగా అబద్ధమని ఆమె కేవలం డైలాగ్స్ మాత్రమే అందించినట్లు శంకర్ ప్రెస్ నోట్ లో తెలిపారు. అంతే కాకుండా సినిమాకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు అంటూ అయితే కథకు సంబంధించిన హక్కులు మాత్రమే తనవే అన్నారు.

ఆమె కేవలం డైలాగ్స్ మాత్రమే అందించారు

ఆమె కేవలం డైలాగ్స్ మాత్రమే అందించారు

సినిమా కథ పూర్తిగా తనదే అంటూ వివరణ ఇచ్చిన శంకర్ సినిమాలో కథ మాటలు దర్శకత్వం టైటిల్ కార్డ్ వేసుకున్నట్లు చెప్పారు. ఎవరికి దక్కాల్సిన క్రెడిడ్ వారికి దక్కిందని సుజాత గారు సినిమాకు డైలాగ్స్ మాత్రమే అంధించారని కథకు గాని ఇతర పాత్రలకు సంబంధించిన విషయాల్లో ఎవరి ఇన్వాల్మెంట్ లేదని అన్నారు.

అర్థం లేని ఆరోపణలు

అర్థం లేని ఆరోపణలు

అపరిచితుడు సినిమా ఆధారంగా తనకు మరో కథ రాసుకునే హక్కు కూడా ఉందని ఆ విషయంలో ఎవరికి అడ్డు చెప్పే హక్కు లేదని అన్నారు. ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పిన శంకర్ తన సినిమాను అడ్డుకోవాడనికి ఎవరికి హక్కు లేదని కౌంటర్ ఇచ్చారు. శంకర్ వివరణతో ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదని తెలుస్తోంది. మరి రవిచంద్రన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X