మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. శంకర్ సినిమా షూటింగ్ గురించి అప్డేట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

గ్యాప్ తీసుకుని

గ్యాప్ తీసుకుని


బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ్ ఆ సినిమాతో అయితే భారీ డిజాస్టర్ అందుకున్నాడు. చాలా గ్యాప్ తీసుకుని ఆయన రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి కావొచ్చింది.

శంకర్ తో సినిమా

శంకర్ తో సినిమా


ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇండియన్ 2 సినిమా సగంలో ఆపిన శంకర్ అనూహ్యంగా దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా ప్రకటించారు. అయితే తమ సినిమా పూర్తి చేయకుండా ఎలా మరో సినిమా ప్రకటిస్తారని ప్రొడక్షన్ సంస్థ కోర్టుకు కూడా వెళ్లి కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టింది.

వచ్చే నెల నుంచే

వచ్చే నెల నుంచే

అయితే తాజాగా ఈ లీగల్ సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ద్వారా ఈ విషయం పరిష్కరించుకోవచ్చని ఇరువర్గాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ రోజు దిల్ రాజు, శంకర్, రామ్ చరణ్ తేజ్ ముగ్గురు సమావేశమయ్యారని సమాచారం అందుతోంది. ఎలాగూ లీగల్ సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి కాబట్టి సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Recommended Video

Star Director Bobby Launches Jagadananda Karaka Movie ​| Filmibeat Telugu
పండుగ చేసుకుంటున్నారుగా

పండుగ చేసుకుంటున్నారుగా

నిజానికి శంకర్ ఈ సినిమా ఇంకా మొదలు పెట్టకుండానే బాలీవుడ్ లో కూడా ఒక సినిమా ప్రకటించారు. రణవీర్ సింగ్ హీరోగా తమిళ తెలుగు భాషల్లో సూపర్ హిట్ అపరిచితుడు రీమిక్స్ చేస్తున్నట్లు స్టూడియోస్ తో కలిసి ఒక సినిమా ప్రకటించారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ తో చరణ్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X