శివ నిర్వాణ జీవితంలో ‘బుజ్జి’ మలుపు.. సమంత, చైతూ విషెస్
నిన్ను కోరి ఘన విజయం తర్వాత ద్వితీయ విఘ్నాన్ని దాటేసిన దర్శకుడు శివ నిర్వాణకు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద మజిలీ విజయ యాత్ర కొనసాగుతుండగానే మరో శుభవార్తను అందుకొన్నారు. మంగళవారం ఆయన పండంటి బిడ్డకు తండ్రి అయ్యారు. ఈ శుభవార్తను సన్నిహితులు, స్నేహితులు, అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు.
నాకు కుమారుడు పుట్టాడు. నా జీవిత మజిలీలో ఒక బుజ్జి మలుపు. జీవితంలో ఇంతకంటే ఏం కావాలని కోరుకొంటాను చెప్పండి అంటూ శివ నిర్వాణ ట్వీట్ చేశారు. తన సంతోషంలో అందర్నీ భాగం చేస్తూ తన కుమారుడితో దిగిన ఫోటోను షేర్ చేశాడు.
దర్శకుడు శివ నిర్వాణ తండ్రి అయ్యారనే వార్తతో ఆయనను సినీ ప్రముఖులు అభినందించారు. సమంత, నాగచైతన్య వ్యక్తిగతం ఫోన్ చేసి విషెస్ తెలిపినట్టు సమాచారం.

నాగచైతన్య, సమంత అక్కినేని జంటగా దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ రూపొందించిన మజిలీ చిత్రం ఏప్రిల్ 5న రిలీజై దూసుకెళ్తున్నది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం 17.5 కోట్ల రూపాయల షేర్ సాధించింది. నాగచైతన్య కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











