'ఖుషి' ఆ బ్లాక్ బస్టర్ మూవీకి కాపీ.. అవి మార్చలేమంటూ దర్శకుడి క్లారిటీ

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఖుషి సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ క్రియేటే చేసుకుంది. అలాగే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఇటీవల ఖుషి సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఖుషి సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపిన భారీ బ్లాక్ బస్టర్ మూవీకి కాపీ అంటూ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.

మహానటి తర్వాత:మహానటి సినిమా తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అగ్ర హీరోయిన్ సమంత రూతు ప్రభు పూర్థి స్థాయిలో ఆన్ స్క్రీన్ పెయిర్ గా నటించిన సినిమా ఖుషి (Kushi 2023). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం, మలయాళ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.

Director Shiva Nirvana Clarity About Kushi Trailer Look Like Alaipayuthey

కశ్మీర్-టర్కీ ప్రాంతాలు:ఖుషి సినిమాలో విజయ్, సమంతతోపాటు జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా అట్టహాసంగా విడుదల చేయనున్నారు. సినిమాను కశ్మీర్, టర్కీ వంటి అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశారు.

2000లో హిట్ మూవీ:ఖుషి సినిమా నుంచి విడుదలైన పోస్టర్లతోపాటు టైటిల్ సాంగ్, నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ (Kushi Trailer)కు సైతం మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసి 2000 సంవత్సరంలో ఒక ఊపు ఊపిన మాధవన్, శాలిని నటించిన 'అలైపాయుతే' (Alaipayuthey) సినిమా మాదిరిగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

Director Shiva Nirvana Clarity About Kushi Trailer Look Like Alaipayuthey

దర్శకుడి స్పందన:స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన 'అలైపాయుతే' సినిమా తెలుగులో 'సఖి'గా (Sakhi Movie) విడుదలై సెన్సేషనల్ హిట్ కొట్టింది. మాధవన్, శాలిని జంటకు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాను ఎంతగానో ఆదరిస్తారు. అలాంటి సఖి సినిమాల ఖుషి ఉందన్న విమర్శలపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు.

Director Shiva Nirvana Clarity About Kushi Trailer Look Like Alaipayuthey

కామన్ గా ఉంటాయి:"ఖుషి ట్రైలర్.. మాధవన్ హిట్ మూవీ అలైపాయుతేలా ఉందని చాలా మంది అంటున్నారు. అయితే, ప్రేమ, పెళ్లి అనే విషయాలు చాలా సినిమాల్లో కామన్ గా ఉంటాయి. బోరింగ్ డైలాగ్స్, డ్రామా లేకుండా ప్రేక్షకులను చిత్రంలో లీనం అయ్యేలా చేయడమనేది చాలా ముఖ్యం. పెళ్లి కాని, పెళ్లయిన ప్రేక్షకులు తమ జీవితాన్ని ఈ మూవీలో చూసుకునే అవకాశం ఉంటుంది. వారికి సినిమా తప్పకుండా కనెక్ట్ చేస్తుంది" అని శివ నిర్వాణ అన్నారు.

Director Shiva Nirvana Clarity About Kushi Trailer Look Like Alaipayuthey

మనం మార్చలేం:ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ ఇంకా కొనసాగిస్తూ.. "నాకు అనిపించేది ఏంటంటే.. అలైపాయుతే అయినా, మౌనరాగం అయినా, ఇంకా వేరే ఏ సినిమా అయినా.. ప్రేమ, వివాహం అనేవి ఒకేలా ఉంటాయి. వాటిని మనం మార్చలేం. ప్రేమకథలో ఏది చెప్పాలనుకున్నా ప్రేమ ఉండాలి. అలాగే పెళ్లి కథలో పెళ్లి ఉండాలి" అని చెప్పుకొచ్చారు. అయితే డైరెక్టర్ కామెంట్స్ చూస్తుంటే సఖి సినిమా తరహా కథ అయినప్పటికీ డ్రామా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X