సూపర్ స్టార్ కొత్త చిత్రం.. హ్యాట్రిక్ డైరెక్టర్‌తో ఫిక్స్.. ఇక బ్లాక్ బస్టరే..
సూపర్ స్టార్ రజినీ తన కొత్త సినిమాలను ఎంత ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. చకచకా సినిమాలను పూర్తి చేసేసి.. మరో కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేసేస్తున్నాడు. అలా కాలా, పేట్టా సినిమాలను ఎంత తొందరగా కంప్లీట్ చేశాడో.. ప్రస్తుతం చేస్తున్న దర్బార్ కూడా అలానే పూర్తి చేస్తున్నాడు.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే లీకైన పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకోగా.. మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

వీరం, వేదాలం, విశ్వాసం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడంతో అజిత్, శివ కాంబినేషన్ అంటే కోలీవుడ్‌లో ఓ సెన్సేషన్. అయితే దర్శకుడు శివ.. తాజాగా సూపర్ స్టార్ రజినీతో కమిట్ అయ్యాడు. రజినీ తన 168 సినిమాను శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు.. ఆ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించబోతోన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే మా కాంబినేషన్‌లో రోబో, పేట్టా లాంటి సూపర్ హిట్ సినిమాలు రాగా.. హాట్రిక్ కొట్టేందుకు వస్తున్నామని సన్ పిక్చర్స్ తెలిపింది.


Click it and Unblock the Notifications











