అందమైన గ్రామీణ నేపథ్యంతో ఉత్తర.. థ్రిల్ అవ్వడం ఖాయం!
లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ఆర్ తిరుపతి దర్శకత్వంలో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్లుగా ఉత్తర చిత్రం రూపొందించబడుతున్నది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఎస్ఆర్ తిరుపతి, శ్రీపతి గంగాదాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తొలిపాట, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ఇటీవల విడుదల చేయగా మంచి రెస్సాన్స్ వచ్చింది. దీపావళీ పండుగను పురస్కరించుకొని ఇటీవల టీజర్‌ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.
టీజర్ లాంచింగ్ సందర్భంగా దర్శకుడు తిరుపతి మాట్లాడుతూ.. మా సినిమా పూర్తిగా తెలంగాణ భాషతో, తెలంగాణ ప్రాంతంలోనే షూటింగ్ చేయడం జరిగింది. గుడిసెల్లోకి పాకిన గ్లోబలైజేషన్‌లో ప్రస్తుత గ్రామీణ వాతావరణం ఎలా ఉందో, ఈ ప్రాంత యువత ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అనే అంశాలతో ఉత్తర సినిమాను తెరకెక్కించాం అని తెలిపారు.
చలాకీగా ఉంటే ఓ యువకుడి జీవితంలోకి ఊహించిన కష్టాలు రావడం, వాటిని హీరో ఎలా తన తెలివి తేటలతో బయటపడ్డారు. ముల్లును ముళ్లుతోనే తీయాలనే లాజిక్‌తో ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదురించాడు అనేది కథ. ఊర్లో జరిగే కథను ప్రతీ ఒక్కరు తమకు అన్వయించుకొంటారు. ప్రతీ ఊరిలో ఉండే సమస్యను, ఇతర అంశాలను చక్కగా తెరకెక్కించాం. ఊహించిన మలుపులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది అని దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. కథ విన్నప్పుడు కంటే షూటింగ్‌లోనే దాని గొప్పతనం తెలిసింది. దర్శకుడు చాలా నిజాయితీగా కథను తెరకెక్కించారు. ఓ కసితో పనిచేసిన యంగ్ టీమ్‌ను ఇంతవరకు చూడలేదు. సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కు థ్రిల్ అవుతారు అని అన్నారు.
హీరోయిన్ కారుణ్య మాట్లాడుతూ.. తెరపైన నన్ను నేనే కొత్తగా చూసుకొన్నాను. ఈ చిత్రంలో చక్కటి పాత్రను ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. కల్ట్ మూవీస్‌లో తెలుగులో చక్కటి చిత్రమవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకొనే రోజు వస్తుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











