RRR తరువాత మరొక RRR రాబోతోంది.. చూస్తే పడి పడి నవ్వుకోవాల్సిందే .. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా మెగా నందమూరి హీరోల కలయికలో వచ్చిన RRR సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రమోషన్స్ కు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే మరొక RRR సినిమాను కూడా త్వరలోనే తీసుకువస్తాను అంటూ దర్శకుడు రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడం విశేషం. అయితే ఆ సినిమా మాత్రం పూర్తిగా కామెడీ తరహాలో ఉంటుంది అని అందరికి ఎంతగానో నవ్విస్తుంది అని కూడా తెలియజేశారు. ఇంతకు రాజమౌళి ఏం చెప్పాడు అనే వివరాల్లోకి వెళితే..

ఈవెంట్ సక్సెస్
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం అంతకు మించి అనేలా తెరకెక్కించిన RRR సినిమా పై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్ని దాటేస్తూన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చిత్ర యూనిట్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. కర్ణాటక లో శనివారం జరిగిన ఈవెంట్ కు కర్ణాటక ముఖ్యమంత్రి అలాగే సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ప్రత్యేక అతిథిగా వచ్చారు.

నిజమైన ఇండస్ట్రీ పెద్ద
ఈ వేడుకలో దర్శకుడు రాజమౌళి మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గురించి రాజమౌళి చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ల రేట్లు పెరగడం లో ఆయన కృషి ఎంతో ఉందని.. ఎవరు ఎన్ని మాటలు ఉన్నా కూడా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇండస్ట్రీ కోసం ముందడుగు వేసినట్లు చెబుతూ ఆయన నిజమైన ఇండస్ట్రీ పెద్ద అని రాజమౌళి వివరణ ఇచ్చారు.

మరొక RRR
అయితే రాజమౌళి RRR సినిమా తర్వాత RRR సినిమా కూడా ఉంటుంది అని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు అది ఈ సినిమాకు సీక్వెల్ కాదు అలాగని వెబ్ సిరీస్ కూడా కాదు. తన సహాయ దర్శకులు చేసిన ఒక డిఫరెంట్ మూవీ అని. అది ఎలా తెరకెక్కించారు అనే విషయాలను కూడా రాజమౌళి తెలియజేశాడు. సినిమాకు పని చేసిన పదిమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ లేకపోతే తను ఈ సినిమాను అంత ఈజీగా తెరపైకి తీసుకు వచ్చే వాడిని కాదు అని రాజమౌళి తెలియజేశారు.

తన అసిస్టెంట్స్ తోనే..
సాధారణంగా రాజమౌళి ఏ సినిమాను తెరపైకి తీసుకొచ్చిన కూడా ముందుగానే ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకుంటాడు. అంతేకాకుండా టెస్ట్ షూట్ కూడా చేసుకుంటాడు. సహాయక దర్శకులకు ప్రత్యేకంగా సలహాలు ఇచ్చి వారితోనే ముందుగా ఈ సినిమాను రిహార్సల్స్ చేయించారట. తన అసిస్టెంట్స్ ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా నటించి చూపించినట్లుగా రాజమౌళి తెలియజేశాడు.

కామేడి వెర్షన్..
ట్రయిల్ షూట్ చేసినా సన్నివేశాలు అన్నిటిని కూడా యధాతధంగా షూట్ చేసినట్లు గా చెప్పిన రాజమౌళి అంతే కాకుండా దాన్ని పర్ఫెక్ట్ ఎడిట్ కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు. సినిమా విడుదల అనంతరం తన అసిస్టెంట్స్ అందరూ కూడా చేసినటువంటి RRR సినిమా మరో కామెడీ వెర్షన్ కూడా ప్రేక్షకులు చూడవచ్చు అని చెప్పుకొచ్చారు. ఇది ఎంతగానో నవ్విస్తుంది అని కూడా తెలియజేశారు. ఆ మూవీ RRR విడుదలైన కొన్ని రోజుల అనంతరం టెలివిజన్ లో లేదా ఓటీటీలో విడుదల చేస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











