My Hero: మహేష్ త్యాగానికి ఉప్పొంగిపోతున్న రాజమౌళి.. పవన్ కళ్యాణ్ పై కూడా స్పెషల్ కామెంట్..
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక్కసారిగా దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా క్రేజ్ అందుకున్నాడు. ఇక ఆయన నుంచి వస్తున్న తదుపరి సినిమా RRRపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తరువాత మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇటీవల మహేష్ బాబు తీసుకున్న ఒక నిర్ణయానికి రాజమౌళి చాలా స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు.

పోటీ లేకుండా
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా భాషతో సంబంధం లేకుండా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిని పెంచిన తరువాత ఆయన ఆలోచనలు కూడా చాలానే మారిపోయాయి. ఇక RRR సినిమాను కేవలం రిలీజ్ చేయడమే కాకుండా ఆ సినిమాకి పెద్దగా పోటీ కూడా లేకుండా చేయాలని ఫిక్స్ అయ్యారు.

రాజమౌళి కంటే ముందే..
ఇక RRR సినిమాను మొదట ఇదే ఏడాది విడుదల చేయాలని అనుకున్నారు. ఇక పరిస్థితుల ప్రభావం వలన సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. బిగ్ బడ్జెట్ సినిమా కాబట్టి తప్పనిసరిగా ఎలాంటి పోటీ ఉండవద్దని జనవరి 7ను ఫిక్స్ చేశారు. అయితే రాజమౌళి కంటే ముందే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు.

మహేష్ నిర్ణయానికి..
ఇక RRR కోసం రాజమౌళి మైత్రి మూవీ మేకర్స్ కంటే ముందే మహేష్ బాబును సంప్రదించడం జరిగింది. ఇక వెంటనే మహేష్ నిర్మాతలతో మాట్లాడి RRR కు పోటీ లేకుండా చేశారు. దీంతో రాజమౌళి ఆ విషయంలో మహేష్ బాబుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. వారు తీసుకున్న నిర్ణయానికి రాజమౌళి మహేష్ బాబుని మై హీరో అంటూ పొగిడేశారు.

మై హీరో అంటూ..
మహేష్ గారు పొంగల్ రిలీజ్ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపారు.. సర్కారు వారి పాట పర్ఫెక్ట్ పొంగల్ చిత్రం అయినప్పటికీ, దానిని వేసవికి తరలించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాడు. మైత్రి మూవీస్ వారికి అలాగే మై హీరోకు టీమ్ మొత్తానికి ధన్యవాదాలు... అని రాజమౌళి వివరణ ఇచ్చారు. దీంతో మై హీరో అనే ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పవన్ కళ్యాణ్ కు కూడా..
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా దర్శకుడు రాజమౌళి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చిన బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నందుకు అభినందనీయం అంటూ చిత్ర యూనిట్ సబ్యులకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక దిల్ F3 సినిమాను కూడా వాయిదా వేసుకోవడంపై రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేశారు.
Recommended Video

మై హీరో.. ట్రెండింగ్..
ఇక రాజమౌళి మహేష్ బాబును మై హీరో అంటూ పేర్కొనడంతో ఆ ట్యాగ్ వరల్డ్ వైడ్ గా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు ఎంత మంచి వ్యక్తి అనే విషయం మరోసారి రుజువైంది అని రాజమౌళి గారితో అర్ధమవుతుంది అంటూ అభిమానులు ఆ ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











