ఇంకా చెబితే సుక్కుకి హార్ట్ ఎటాక్ వస్తుంది.. మళ్ళీ రంగస్థలం కాంబో పక్కా: రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించిన ప్రమోషన్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్యాప్ లేకుండా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసే విధంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ఒక వేడుకను ముగించుకున్న చిత్ర యూనిట్ తమిళం ఇండస్ట్రీలో కూడా గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహించింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి రంగస్థలం కాంబో మారోసారి సాలీడ్ గా రాబోతున్నట్లు గుర్తు చేశారు.

రికార్డులను బ్రేక్ చేయడం పక్కా..

రికార్డులను బ్రేక్ చేయడం పక్కా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా RRR. ఈ మల్టీస్టారర్ ని నిర్మాత డి.వి.వి.దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే బాహుబలి సినిమా అనంతరం రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. తప్పకుండా సినిమా పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరిలో ఒక నమ్మకం అయితే ఉంది.

పవర్ఫుల్ రోల్స్

పవర్ఫుల్ రోల్స్

జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. అజయ్ దేవగన్ మరొక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా చాలా కష్ట పడినట్లు రాజమౌళి తెలియజేశాడు.

మరోసారి రంగస్థలం కాంబో

మరోసారి రంగస్థలం కాంబో

అయితే వీరు ఇస్తున్న ఇంటర్వ్యూలలో కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ గా తెలియజేశారు. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి కూడా ఈ కాంబినేషన్ పై స్పందించాడు.

హార్డ్ హిట్టింగ్ అనేలా..

హార్డ్ హిట్టింగ్ అనేలా..

దర్శకులు రాజమౌళి, సుకుమార్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. అయితే వీరు వారి సినిమాలకు సంబంధించిన అనేక రకాల విషయాలపై నిత్యం చర్చలు జరుపుకుంటూ ఉంటారు. ఇక రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోయే సినిమాల్లో ఇంట్రడక్షన్ సీన్ మాత్రం హార్డ్ హిట్టింగ్ అనేలా ఉంటుంది అని ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ కలుగుతుంది అని రాజమౌళి తెలియజేశాడు

సుకుమార్ కు హార్ట్ ఎటాక్ వస్తుంది

సుకుమార్ కు హార్ట్ ఎటాక్ వస్తుంది

సుకుమార్ రామ్ చరణ్ ఇదివరకే ఒక ప్రాజెక్ట్ పై చర్చలు జరిపినట్లు టాక్ అయితే వచ్చింది. మొత్తానికి అది నిజమేనని రాజమౌళి ద్వారా మరోసారి రుజువయ్యింది. అంతేకాకుండా సినిమా రంగస్థలం కంటే భారీగా ఉంటుందని కూడా తెలిసిపోయింది. ఇక ఇంట్రడక్షన్ సీన్ గురించి చెప్పిన రాజమౌళి అంతకంటే ఎక్కువ చెబితే సుకుమార్ కు హార్ట్ఎటాక్ వస్తుందని కూడా సరదాగా తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X