twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ట్రైలర్ వెనుక ఆ కష్టమంతా అతనిదే.. అజ్ఞాత వ్యక్తిని పరిచయం చేసిన రాజమౌళి

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల హడావుడి మొదలయ్యింది. ముఖ్యంగా RRR సినిమా ట్రైలర్ ఇండస్ట్రీను వాతావరణాన్ని మార్చేసింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమాకు ఆ స్థాయిలో హైప్ రావడానికి ట్రైలర్ వెనుక చాలామంది కష్టం ఉంది. ఇక అందరి కంటే ఎక్కువగా ఒక వ్యక్తి చాలా బాగా హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంపై రాజమౌళి కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు.

    ఈసారి అంతకుమించి

    ఈసారి అంతకుమించి

    RRR సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా పదిహేను వందల కోట్ల మార్కెట్ ను అందుకున్న రాజమౌళి ఈసారి అంతకుమించి అనేలా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాడు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ దక్కాలని రాజమౌళి చాలా కృషి చేస్తున్నాడు.

    అందరికి క్రెడిట్ వచ్చేలా..

    అందరికి క్రెడిట్ వచ్చేలా..

    బాహుబలి సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరి గురించే రాజమౌళి అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేరు పేరున గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే. వారి గురించి అలాగే వారు చూపించిన పనితనం గురించి కూడా చాలా క్లియర్ గా తెలియజేశాడు. అప్పుడే రాజమౌళి వ్యక్తిత్వం గురించి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి మాత్రమే కాకుండా తన వెనుక కష్టపడే వారికి కూడా క్రెడిట్ ఇస్తారని అర్ధమయ్యింది.

    చెన్నైలో ట్రైలర్ వర్క్

    చెన్నైలో ట్రైలర్ వర్క్

    బాహుబలి సినిమా కంటే కూడా RRR సినిమాకు చాలా మంది కష్టపడ్డారని ట్రైలర్ చూసిన తర్వాత అర్ధమయ్యింది. ఇక రాజమౌళి ఒక్కడే ఈ సినిమా వెనుక లేడు అని చెప్పవచ్చు. ఇక వీలైనప్పుడల్లా జక్కన్న సోషల్ మీడియా ద్వారా సినిమాకు వర్క్ చేసిన వారి గురించి చెబుతూ వస్తున్నాడు. ఇక ట్రైలర్ కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి చెన్నై లో ట్రైలర్ ను ఎడిట్ చేయించారట.

    ధన్యవాదాలు బ్రదర్..

    ధన్యవాదాలు బ్రదర్..

    సోషల్ మీడియా ద్వారా స్పందించిన రాజమౌళి అజ్ఞాత వ్యక్తి గురించి వివరణ ఇచ్చాడు. ట్రైలర్ పై భారీ స్థాయిలో స్పంధన రావడానికి ఒక వ్యక్తి నైపుణ్యం బాగా దోహదపడిందని అంటూ.. RRR ట్రైలర్‌ను కట్ చేసిన ఎడిటర్ ఎడిటర్ ప్రవీణ్ సినిమా కోసం మీరు వెచ్చించిన మీ సమయం, సహనం మరియు కృషికి ధన్యవాదాలు బ్రదర్ అని రాజమౌళి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    Recommended Video

    RRR Trailer : RRR Trailer Set New Record In Tollywood || Filmibeat Telugu
    మూడు నిమిషాల ట్రైలర్ లో..

    మూడు నిమిషాల ట్రైలర్ లో..

    కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సినిమాలకు వర్క్ చేసిన ఎడిటర్ ప్రవీణ్ పనితనం గురించి తెలుసుకున్న రాజమౌళి దాదాపు రెండు నెలల పాటు అతనితో వర్క్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. మూడు నిమిషాల ట్రైలర్ లో జక్కన్న చాలా పవర్ఫుల్ షాట్స్ ను బలమైన స్టోరీని అలాగే ఎమోషన్స్ ను ప్రజెంట్ చేయడానికి చాలా ఆలోచించాడట. ఇక ఆయనకు సపోర్ట్ గా ఎక్కువగా హార్డ్ వర్క్ చేసింది ప్రవీణ్ అని వివరణ ఇచ్చారు.

    English summary
    Director ss rajamouli about RRR trailer cut editor work.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X