మహేష్ సినిమాపై మరో ట్విస్ట్ ఇచ్చిన రాజమౌళి.. ఏదైనా ఆ సినిమా తరువాతే..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పాన్ ఇండియా సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. ఇక బాహుబలి సినిమా అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచం ముందు పెట్టిన రాజమౌళి RRR సినిమా తర్వాత అంతకుమించి అనేలా పైకి తీసుకువెళ్లనున్నట్లు అర్థమైపోయింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా నెంబర్ వన్ దర్శకులలో రాజమౌళి టాప్ లో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇక RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మీడియా వేదికగా రాజమౌళి ఆ ప్రాజెక్టుపై మరొకసారి క్లారిటీ ఇచ్చాడు.

ఈజీగా బ్రేక్ ఈవెన్..

ఈజీగా బ్రేక్ ఈవెన్..

దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ఇకనుంచి పాన్ ఇండియా తరహాలోనే రూపొందుతాయి అని చాలా క్లారిటీ గా అర్థమైంది. ప్రస్తుతం ఈ దర్శకుడు సినిమాలు అన్ని భాషల్లో కూడా ప్రమోట్ చేసే విధంగా బిజీ అవుతున్నారు. ఇప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో RRR సినిమా పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తప్పకుండా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చాలా ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎంతో ఆసక్తిగా..

ఎంతో ఆసక్తిగా..

RRR సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇద్దరు హీరోలు కూడా మొదటిసారి కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా కావటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆ తరువాతే మహేష్ సినిమా

ఆ తరువాతే మహేష్ సినిమా

దర్శకుడు రాజమౌళి ఇటీవల తమిళ్ లో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ రాజమౌళి తన తదుపరి సినిమా విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. గతంలో నేను మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు వివరణ ఇచ్చాను అయితే ప్రస్తుతం తన ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాతనే తదుపరి సినిమా పై ఫోకస్ పెడతాను అని తెలియజేశాడు. RRR సినిమా ముగిసిన తరువాతనే మహేష్ సినిమాను స్టార్ట్ చేస్తానని తెలియజేశాడు.

కథ సిద్ధమే కానీ..

కథ సిద్ధమే కానీ..

రాజమౌళి మహేష్ సినిమాపై ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రచయిత K విజయేంద్రప్రసాద్ కూడా ఈ సినిమాకు సంబంధించి ఒక కథను సిద్ధం చేసినట్లు తెలియజేశారు. అది అది రాజమౌళి ఓకే చేస్తే గాని పట్టాలెక్కే అవకాశం ఉండదు అని ఇంకా పూర్తిస్థాయిలో రాజమౌళికి కూడా వినిపించలేదని ఆయన తెలియజేశారు.

ఎలా ఉంటుందంటే?

ఎలా ఉంటుందంటే?

ఇక మహేష్ బాబు సినిమా మాత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇది వరకే ఒక టాక్ వచ్చింది. దాదాపు అది నిజమే నంటూ విజయేంద్రప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ విషయంలో ఇంకా అఫీషియల్ గా ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. మరి మహేష్ బాబు తో రాజమౌళి ఎలాంటి విజువల్ వండర్ ను ప్రేక్షకులకు అందిస్తాడు చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X