అలుపొచ్చినా ఆగేది లేదు.. RRR షూటింగ్ కోసం రాజమౌళి కఠిన నిర్ణయాలు!

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమలు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల నిర్మాతలు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మొత్తానికి ఎదో ఒక విధంగా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు కొందరు. షూటింగ్ పనులను ఆలస్యం చేయకుండా వీలైనంత తొందరగా పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి RRR సినిమా షూటింగ్ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదట.

Recommended Video

RRR Update : Rajamouli Taking Hard Decisions For RRR Movie Shooting
కాంప్రమైజ్ కావడం లేదు..

కాంప్రమైజ్ కావడం లేదు..

టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ RRR సినిమా కోసం దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండడంతో షూటింగ్ విషయంలో దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. వీలైనంత వరకు తగినంత సమయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు.

ఈ వారంలోనే..

ఈ వారంలోనే..

RRR షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయ్యింది. ఇక మిగిలిన షూటింగ్ కోసం ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. కానీ రాజమౌళి ప్లాన్ ప్రకారం అవుట్ డోర్ లో కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయాల్సి ఉంది. ఇకపోతే షూటింగ్స్ నిర్వహించుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్ స్టార్ట్ చేశాయి. ఈ వారంలోనే RRR షూటింగ్ కూడా మొదలు కానుంది.

30% షూటింగ్ కోసం..

30% షూటింగ్ కోసం..

అయితే ఒక్కసారి మొదలు పెడితే షూటింగ్ అపకుండా పూర్తి చేయాలని ఆదివారం తప్పితే మిగతా రోజులు వీలైనంత వరకు వర్క్ చేయాలని అనుకుంటున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంట్లో ఉండి అయినా చేసుకోవచ్చు. ఒకే చోట చేసుకునే పని కాబట్టి మిగిలిన 30శాతం షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే కరోనా పాజిటివ్ ల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పుడే పూర్తి చెయ్యాలి..

ఇప్పుడే పూర్తి చెయ్యాలి..

ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 2లక్షలకు చేరువవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకి ఎక్కడో ఒక చోట పాజిటివ్ కేసుల సంఖ్య పదుల సంఖ్యలో పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత భయంకరంగా మరే అవకాశం ఉందని వీలైనంత త్వరగా ఎక్కువ మందితో అవసరం ఉన్న షూటింగ్ పనులను ఇప్పుడే పూర్తి చేసుకోవాలని రాజమౌళి కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X