మహేష్ బాబు సినిమాపై మల్టీస్టారర్ కామెంట్స్.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి.. అలా ఉంటుందట!

దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయని చెప్పవచ్చు. ఇక చాలా రోజుల తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అంతే కాకుండా ఈ సినిమా పై గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తుండగా వాటిపై కూడా ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అదే తరహాలో ఆలోచించి..

అదే తరహాలో ఆలోచించి..

దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఆలోచిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమా అనంతరం రాజమౌళి చేయబోయే తర్వాత సినిమాపై తప్పకుండా అంచనాలు భారీగానే ఉంటాయని అందరికీ తెలుసు. ఇక రాజమౌళి కూడా అదే తరహాలో ఆలోచించి ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 వ తేదీన విడుదల కాబోతోంది.

 గ్యాప్ లేకుండా..

గ్యాప్ లేకుండా..

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీ గా పాల్గొంటున్న రాజమౌళి.. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లను కూడా వెంటబెట్టుకుని వెళ్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సౌత్ ఇండియా, నార్త్ ఇండస్ట్రీలోనూ భారీగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు. ఇక ఇటీవల రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కర్ణాటక వెళ్లడం జరిగింది. అక్కడ హీరోలతో పాటు బెంగళూరు మీడియాతో మాట్లాడిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే తన తదుపరి సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇచ్చేసాడు.

మహేష్ సినిమాపై అప్డేట్

మహేష్ సినిమాపై అప్డేట్

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడని అంతేకాకుండా బాలకృష్ణ కూడా ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడు అని వార్తలు కూడా వచ్చాయి. ఒక విధంగా అది నిజమే అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇటీవల రాజమౌళి క్లారిటీ తో అవన్నీ కూడా అబద్ధాలు అని తేలిపోయింది.

 మల్టీస్టారర్ కాదు..

మల్టీస్టారర్ కాదు..

రాజమౌళి రీసెంట్ గా కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. మహేష్ బాబు తో చేయబోయే సినిమా మల్టీస్టారర్ కాదు. సింగల్ స్టారర్ మూవీగా రాబోతున్నట్లు ఒక వివరణ ఇచ్చారు. దీంతో మహేష్ బాబు అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాను సమ్మర్ అనంతరం మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హాలిడేస్ కు వెళ్లిన తరువాత..

హాలిడేస్ కు వెళ్లిన తరువాత..

ప్రస్తుతం RRR సినిమా రిలీజ్ లో బిజీగా ఉన్న రాజమౌళి విడుదల తర్వాత కొన్ని రోజులపాటు ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. హాలిడేస్ అనంతరం మళ్లీ మహేష్ బాబుకు సంబంధించిన సినిమా పై స్పెషల్ ఫోకస్ పెట్టమన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను రైటర్ విజేయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది చివర్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు అని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X