హాలీవుడ్ ఆఫర్స్ పై రాజమౌళి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్.. అసలైన పాన్ ఇండియా డైరెక్టర్!
దర్శకధీరుడు రాజమౌళి కమర్షియల్ సినిమాలు ఎన్ని చేసినా కూడా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా ఉంటాడని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం కుటుంబ పరంగానే కాకుండా సమాజం గురించి కూడా ఎంతగానో ఆలోచిస్తాడాని చాలామంది చెబుతుంటారు. అయితే రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం అంతకుమించి అనేలా RRR సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేస్తున్న సందర్భంగా బాలీవుడ్ మీడియా తో రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో రాజమౌళి బాలీవుడ్ ఆఫర్స్ పై ఎవరూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చారు.

మొట్టమొదటిసారి..
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి చాలా చక్కగా తన కెరీర్ మొదలు పెట్టిన రాజమౌళి.. ఆ తరువాత మెల్ల మెల్లగా తన స్థాయిని పెంచుకునే విధంగా సినిమాను తెరపైకి తీసుకు వస్తూ వచ్చాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా మాస్ ఎలివేషన్స్ కూడా హైలెట్ చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిసారి పాన్ ఇండియా అనే పదానికి అసలైన అర్థం చూపించాడు. బాహుబలి సినిమా తో రాజమౌళి స్థాయి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అమాంతం పెరిగిపోయింది.

తెలుగులోనే కాకుండా..
నేడు విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై పెరుగుతున్న అంచనాల డోస్ ను అమాంతం పెంచేసింది. మూడు నిమిషాల ట్రైలర్ లోనే దర్శకుడు రాజమౌళి సినిమా పై ఒక్కసారిగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. తప్పకుండా మొదటి రోజు మొదటి షో చూడాలి అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కామెంట్ చేస్తున్నాడు అంటే అది రాజమౌళి ప్రతిభకు ప్రత్యేక నిదర్శనమని చెప్పవచ్చు. సినిమా ట్రైలర్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది.

హాలీవుడ్ ఆఫర్స్ పై..
ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళిని బాలీవుడ్ మీడియా ప్రతినిధులు అనేక రకాల ప్రశ్నలు అడిగారు. అయితే హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని టాక్ వచ్చింది అది ఎంతవరకు నిజమని కూడా ప్రశ్నించారు. అయితే ఇప్పటి వరకూ తాను అలాంటి ఆఫర్స్ పెద్దగా అందుకోలేదని ఇండియన్ సినిమాల పైనే ఎక్కువగా ఆసక్తి ఉందని చెప్పాడు. అంతేకాకుండా ఇండియన్ కథతోనే హాలీవుడ్ లోకి వెళ్లాలని ఉందని కూడా రాజమౌళి తెలియజేశాడు.
Recommended Video

అసలైన ఇండియన్ డైరెక్టర్
రాజమౌళి ఒకవేళ హాలీవుడ్ సినిమా చేసినా కూడా అందులో భారతీయ నేపథ్యానికి సంబంధించిన అంశాలు పూర్తిగా ఉంటాయి అని చెప్పకనే చెప్పాడు. సాధారణంగా మన ఇండియాలో ఏ దర్శకుడైనా ఒకసారి ఒక భాష నుంచి మరో భాషకు వెళితేనే చాలా రకాల మార్పులు చేస్తూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఇండియన్ కథలు హాలీవుడ్ వెండితెరపై ఉంచాలని అనుకుంటున్నాడు అంటే అతడు ఎంత గొప్పగా ఆలోచించడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి ఇచ్చిన సమాధానంతో అభిమానులు అసలైన ఇండియన్ డైరెక్టర్ అంటూ చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











