ఆ బ్రాండ్ కోసం నటుడిగా మారిన రాజమౌళి.. హీరో రేంజ్ లో న్యూ లుక్ వైరల్
ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడిగా గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు రాజమౌళి చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచం మొత్తం చూస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న అడ్వంచర్ కథాంశంతో మూవీ చేయబోతోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ఈ నెల ఆఖరు లేదంటే వచ్చే ఏడాది మార్చి లోపు స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక రాజమౌళి అప్పుడప్పుడు సినిమాలలో కనిపించి నటుడిగా తనకున్న ఇంట్రెస్ట్ కూడా తీర్చుకుంటూ ఉంటాడు. అలాగే నాని మజ్ను సినిమాలో ఒరిజినల్ పాత్రలోనే కొద్దిసేపు కనిపించాడు. చాలా సినిమాలలో గెస్ట్ అపీరియన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ సొంతం చేసుకున్నాడు.

అతని ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా లెవల్ లో స్టార్ కంటే ఎక్కువ బ్రాండ్ ఇమేజ్ రాజమౌళికి ఉంది. ఈ ఇమేజ్ తో ఇప్పుడు రాజమౌళి ముఖ్యానికి మ్యాకప్ వేసుకోవడం విశేషం. ప్రముఖ మొబైల్ కంపని ఒప్పో బ్రాండ్ అంబాసిడర్ గా రాజమౌళి ఫిక్స్ అయ్యాయి. దీనికి సంబందించిన భారీ రెమ్యునరేషన్ ఇచ్చి రాజమౌళితో ఒప్పందం చేసుకున్నారు.
ఇక ఈ మొబైల్ కి సంబందించిన కమర్షియల్ యాడ్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. షూట్ వేసుకొని యాడ్ లో పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో రాజమౌళి ఈ ఫోన్స్ ని ప్రమోట్ చేయబోతున్నాడని అర్ధమవుతోంది.
మొత్తానికి ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోలు మాత్రం మార్కెట్ లో ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండేవారు. అయితే ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ఇప్పుడు తన బ్రాండ్ ఇమేజ్ తో కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఉత్పత్తులని ప్రమోట్ చేయడం విశేషం. దీనిని బట్టి రాజమౌళి స్టార్ స్టేటస్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చెప్పొచ్చు. ఇక రాజమౌళి చేసిన ఒప్పో కమర్షియల్ యాడ్ అతి త్వరలో రిలీజ్ కానుందంట.


Click it and Unblock the Notifications











