India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SSMB29: మహేష్ సినిమా కోసం రాజమౌళి మొదటి అడుగు పడింది.. గ్రాఫిక్స్ స్టూడియోతో చర్చలు..

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకధీరుడు రాజమౌళి కలయికలో రాబోతున్న మొట్టమొదటి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చినప్పటినుంచి కూడా ఎలాంటి సినిమా వస్తుందా అని అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా సమయం తీసుకునే రాజమౌళి ఇటీవల ఒక గ్రాఫిక్స్ స్టూడియో తో కలిసి చర్చలు జరిపిన విషయాన్ని తెలియజేశాడు. అసలు రాజమౌళి ఎందుకు కలిశాడు అనే వివరాల్లోకి వెళితే..

  భారీగా పెరిగిన అంచనాలు

  భారీగా పెరిగిన అంచనాలు

  RRR సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ను చాలా పవర్ఫుల్ గా చూపించిన రాజమౌళి మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్ సందుకుని టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దీంతో రాజమౌళి తర్వాత చేయబోయె మహేష్ 29వ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

  ఆఫ్రికా అడవుల నేపథ్యంలో

  ఆఫ్రికా అడవుల నేపథ్యంలో

  తప్పకుండా మహేష్ బాబుతో కూడా RRR కంటే హై రేంజ్ లోనే ఉంటుంది అని ఇది వరకే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఒక కథను అనుకుంటున్నట్లు అప్పుడు ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఇంకా రాజమౌళి మాత్రం ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అని కూడా అన్నారు.

  అడ్వెంచర్ సినిమా?

  అడ్వెంచర్ సినిమా?

  ఇక రీసెంట్ గా రాజమౌళి పోస్ట్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టును గమనిస్తే ఆయన కథను దాదాపు ఫైనల్ చేసినట్లుగానే తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ పనులు మొత్తం ఇంకా పూర్తవలేదని సమాచారం. నిజంగా రాజమౌళి ఆఫ్రికా అడవులు నేపథ్యంలోనే సినిమా చేస్తున్నాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ తప్పకుండా ఆయన విజువల్ ఎఫెక్ట్స్ హై లెవెల్ లో ఉండే విధంగా అడ్వెంచర్ సినిమాను తీసుకు రాబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

  వాళ్ళతో కలిసి చర్చలు

  వాళ్ళతో కలిసి చర్చలు

  ఎందుకంటే రాజమౌళి ఇటీవల ఫ్రాన్స్ కు చెందిన ఒక ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో అధినేతలతో కలిసి చర్చలు జరపడం విశేషం. యూనిట్ ఇమేజ్ అనే త్రీడీ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో తో కలిసి రాజమౌళి చర్చలు కొనసాగించినట్లుగా చెప్పారు. ఆయనతోపాటు రాజమౌళి ప్రతి సినిమాకు వర్క్ చేసే విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ కమల్ కన్నన్ కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి విషయాల్లో ఎక్కువగా అవగాహన ఉన్నా బాహుబలి నిర్మాత ఆర్కా మీడియా సంస్థ అధినేత శోబు కూడా వారితో చర్చలు జరిపారు.

   గంటల తరబడి చర్చలు

  గంటల తరబడి చర్చలు

  ఇక రాజమౌళి వారితో కొన్ని గంటల తరబడి ప్రాజెక్టు విషయంలో విజువల్ ఎఫెక్ట్స్ పై తనకున్న ఎన్నో ప్రశ్నలపై సందేహాలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఇక వారు ఇచ్చిన సమాధానాలతో రాజమౌళి సన్నివేశాలను ఎలా డిజైన్ చేసుకోవాలి అనే విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గ్రాఫిక్స్ కోసం బడ్జెట్ ఎంత అవుతుంది అనే విషయం కూడా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి మహేష్ బాబుకు సంబంధించిన ప్రాజెక్టును ఇమేజ్ యూనిట్ సంస్థతో కలిసి తెరపైకి తీసుకు రాబోతున్నట్లు వివరణ అయితే ఇచ్చేశారు.

  YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
  కనీసం రెండేళ్ల సమయం?

  కనీసం రెండేళ్ల సమయం?

  ఇక మహేష్ బాబు తో రాజమౌళి రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది జనవరి అనంతరం మొదలు పెట్టబోతున్నారు. అప్పటివరకు సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులన్ని కూడా ముగించుకోనున్నారు. ఇక ఆ లోపు మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక రాజమౌళి సినిమా థియేటర్ లోకి రావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టవచ్చని టాక్.

  English summary
  Director SS Rajamouli special discussion with france based VFX studio for SSMB 29
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X