Governors Awards: హాలీవుడ్ లో రాజమౌళి స్టైలిష్ లుక్.. కొడుకుతో కలిసి అలా..

దర్శకదీరుడు రాజమౌళి RRR సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇటీవల కొన్ని దేశాల్లో ఆ సినిమా ప్రత్యేకమైన షోలకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం రాజమౌళి పని తీరుపై ప్రశంసలు కురిపించారు. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి ఫ్లాట్ ఫారామ్ లో ఈ సినిమాను చూసిన కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పాజిటివ్ గా స్పందించారు.

అయితే రాజమౌళి రాబోయే రోజుల్లో రాజమౌళి హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు అందుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 13వ వార్షిక గవర్నర్స్ అవార్డ్స్ ఈవెంట్ కూడా ఎస్ఎస్.రాజమౌళికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇక ఆ ఈవెంట్ లో బ్లాక్ సూట్ ధరించిన రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియా ముందు హైలెట్ గా నిలిచారు.

Director SS rajamouli special look viral at 13th Governors Awards

ఈ ఈవెంట్ లో ప్రముఖ హాలీవుడ్ నటీనటులు కూడా హాజరయ్యారు. ఇక స్టార్ డైరెక్టర్ కుమారుడు కార్తికేయ ట్విట్టర్ లో బ్లాక్ సూట్‌లో రాయల్‌ లుక్ లో ఉన్న తన తండ్రి ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాగా ఆ సినిమా వెండితెర పైకి రాబోతోంది.

Director SS rajamouli special look viral at 13th Governors Awards

ఇప్పటికే పనులు కూడా మొదలైనట్లు రాజమౌళి తెలియజేశారు. తన తండ్రి కథ మొత్తం పూర్తి చేశారు అని అయితే ప్రస్తుతం పూర్తిస్థాయిలో పనులు కొనసాగుతున్నట్లు చెబుతూ.. ఒక అడ్వెంచర్ మూవీ తరహాలో సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక మహేష్ బాబు పాత్ర కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో లంచ్ చేయబోతున్నారు. ఇక దాదాపు ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం షూటింగ్ కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ సినిమా రావడానికి మరో రెండున్నారేళ్ళ సమయం పెట్టె ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X