షూటింగ్ లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన లేడి డైరెక్టర్ సుధా కొంగర.. ఫొటోలు వైరల్!
ప్రముఖ లేడి డైరెక్టర్ సుధ కొంగర షూటింగ్ లో గాయపడ్డారు. అక్షయ్ కుమార్ తో ఇటీవల న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సుధ ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉండగా అనుకోకుండా ఒక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక అందులో సుధ అనుకోకుండా కింద పడడంతో ఆమె చేయి కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక చిత్ర యూనిట్ సభ్యులు హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. ఇక సుధ కొంగర ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం ఆమె ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందే అని వైద్యులు చెప్పారు. అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంది అనే విధంగానే సూపర్ అంటూ విభిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఇక దాదాపు నెల రోజులపాటు రెస్ట్ అవసరమవుతుంది అని ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఆమె గాయానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సుధా కొంగర పలు హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు నందుకున్నారు.
డెక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత గోపీనాథ్ జీవిత ఆధారంగా తెరపైకి వచ్చిన ఆకాశం నీ హద్దురా (సూరరై పొట్రు) ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహించారు. విభిన్నమైన దర్శకత్వ ప్రతిభతో సుధా కొంగర పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆమెతో సినిమాలు చేయడానికి ప్రముఖ హీరోలు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు.

ప్రస్తుతం సూరరై పొట్రు కథను ఆమె హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమా షూటింగ్ కూడా దాదాపు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఊహించిన విధంగా సుధ ప్రమాదంకు గురైంది. దీంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక మరోవైపు సూర్యతో కూడా ఆమె మరో సినిమా చేయడానికి చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో సుధా హీరో వెంకటేష్ తో కూడా గురు అనే సినిమా చేశారు. ఇక మరోసారి కూడా వారి కాంబినేషన్ కలిసే అవకాశం ఉన్నట్లు గతంలో అనేక రకాల కథనాలు వెలుపడ్డాయి.


Click it and Unblock the Notifications











