OG Shoot Begins: అదిరిపోయేలా సర్‌ప్రైజ్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్.. ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేది ఇదే కదా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ OG అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమవుతున్నారు. అయితే నేడు ముంబైలో తొలి షెడ్యూల్ను మొదలుపెట్టిన చిత్రం యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఇక పవన్ ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకుంటున్నారో అదే తరహాలో ఈ అప్డేట్ తో దర్శకుడు మంచి కిక్ అయితే ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ స్థాయిలో: రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న డైరెక్టర్ సుజిత్ ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో అనే సినిమా చేశాడు. ఆ తర్వాత అతనికి చాలా రకాల ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఎందుకో అవి పట్టాలు ఎక్కలేదు. ఇక మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో OG ప్రాజెక్టును భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు.

మొదట్లోనే పాజిటివ్ బజ్: మాఫియా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ యాక్షన్ మూవీ గా ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్న సుజిత్ పవన్ కళ్యాణ్ ను ఫాన్స్ ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అదే తరహాలో చూపించడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. మొదట్లో కేవలం ఒకే ఒక్క కాన్సెప్ట్ పోస్టర్ ద్వారానే అతను మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. తప్పకుండా సినిమా అంచనాలను అందుకుంటుంది అనే విధంగానే ఫ్యాన్స్ లో ఒక నమ్మకం అయితే క్రియేట్ అయింది.
వీడియో హైలెట్: ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన వీడియోను కూడా విడుదల చేశారు. షూట్ మొదలయ్యింది అని దర్శకుడు సుజిత్ తన స్క్రిప్టు రాసుకుంటున్న విధానం.. అలాగే ఆలోచన విధానాన్ని కూడా ఆ వీడియోలో హైలెట్ చేశాడు. అందులో గ్రానైట్స్ అలాగే బుల్లెట్స్ ఇక కత్తి పట్టుకొని ఉన్న షాట్స్ కూడా చాలా హైలైట్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ను చాలా డిఫరెంట్ గా చూపించడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది.
ఫ్యాన్స్ కు నచ్చేలా..: ఇప్పటివరకు పవన్ ఫ్యాన్స్ ఇలాంటి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు అని ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత అర్థమయింది. తప్పకుండా సినిమా అయితే అంచనాలను అందుకునే విధంగా ఉంటుంది అని చెప్పవచ్చు. దర్శకుడు సుజిత్ తన ఆలోచన విధానంతో పవర్ స్టార్ ను ఫాన్స్ ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అలాగే ప్రజెంట్ చేస్తాడని కూడా కామెంట్స్ అయితే వెలువబడుతున్నాయి.
పవన్ తో వచ్చేవారం : ఇక ఓజీ రెగ్యులర్ సినిమా షూటింగ్ ను నేడు మొదలుపెట్టిన చిత్ర యూనిట్ సభ్యులు వచ్చేవారం పవన్ కళ్యాణ్ తో మరొక కీలకమైన షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక షూటింగ్ ను అయితే పవన్ కళ్యాణ్ రెండు నెలల టార్గెట్ తో ఫినిష్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది


Click it and Unblock the Notifications











