RC17: రామ్ చరణ్‌కు ఇద్దరు భామలు.. సుకుమార్ ప్లానింగ్ మూములుగా లేదుగా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా 'గేమ్ ఛేంజర్' చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ సోషల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కావడంతో ఆడియెన్స్ మాత్రం 'గేమ్ ఛేంజర్' చిత్రానికి మంచి రివ్యూస్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. నెక్ట్స్ రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్స్ పైనా ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కు కూడా ఎంతో ఆసక్తి నెలకొంది.
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ క్రేజ్ వచ్చిన రామ్ చరణ్ కు ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' చిత్రాలు ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో చరణ్ అభిమానులు తదుపరి సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా వచ్చే రిలీజ్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేలా చెర్రీ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'ఉప్పెన' తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ16గా వర్క్ టైటిల్ ఫిక్స్ చేసి షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాతో చెర్రీ ఇండియాను షేక్ చేస్తారని ఆర్సీ16 టీమ్ తోపాటు ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరో బుచ్చిబాబు కూడా అదే స్థాయిలో హామీనిస్తున్నారు.

కాగా.. 'పుష్ప' సిరీస్ తో సంచలనం సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి కొలాబరేట్ కాంబోతున్న విషయం తెలిసిందే. ఆర్సీ17గా ఆ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతుంది. అందుకు అన్నీ ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఒకటి బయటికి పొక్కింది. రామ్ చరణ్ సరసన ఇద్దరు హీరోయిన్లను సెలెక్ట్ చేశారంట సుకుమార్. వరల్డ్ వైడ్ గా చెర్రీ ఉన్న క్రేజ్ తగ్గట్టుగానే కథానాయికలను ఎంపిక చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరి పేర్లు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.
'పుష్ప2', 'యానిమల్' చిత్రాలతో నేషనల్ వైడ్ గా రచ్చ చేస్తున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, 'సాహో'తో తెలుగు వారిని పలకరించడమే కాకుండా.. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో దుమ్ములేపుతున్న శ్రద్ధా కపూర్ ను సుకుమార్ ఆర్సీ16కి ఎంపిక చేశారని తెలుస్తోంది. వీరిద్దరితో రామ్ చరణ్ కెమిస్ట్రీ బిగ్ స్క్రీన్ పై బాగా పండుతుందని సుకుమార్ లెక్కలు వేస్తున్నారు. అంతే కాదు.. శ్రద్ధా కపూర్ తో నార్త్ మార్కెట్, అలాగే నేషనల్ క్రష్ తో ఇటు సౌత్, అటు నార్త్ లో బిజినెస్ జరిగేలా చూస్తున్నారంట.
కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ కు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలైతే బాగుటుందని అంటున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్లతో తొలిసారిగా సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నా కథపైనా ఆసక్తి నెలకొంది. పుష్పరాజ్ వంటి సెన్సేషనల్ క్యారెక్టరైజేషన్ తో వరల్డ్ వైడ్ గా దుమ్ములేపిన సుకుమార్.. మరి చెర్రీని ఎలా చూపించబోతున్నారనేది మరింత ఇంట్రెస్టింగ్ మారింది. ఇక రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో 2018లో 'రంగస్థలం' చిత్రం విడుదలైన బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. మళ్లీ వీరి కాంబోలో ఆర్సీ17 రూపుదిద్దుకోనుండటంతో బాక్సాఫీస్ లెక్కలు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటున్నారు.


Click it and Unblock the Notifications











