పుష్ప కోసం సుకుమార్ భారీ ప్రయోగం.. సాధ్యమయ్యే పనేనా?
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా అల్లు అర్జున్ మొదటి సారి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా షూటింగ్ కు కరోనా గట్టి దెబ్బె వేసింది. అసలే సుకుమార్ చాలా స్లోగా జాగ్రత్తగా చేసే పనిని కరోనా ఇంకాస్త ఆలస్యం చేసింది. ఇక ధైర్యంగా సినిమాను మొదలు పెట్టినప్పటికి కరోనా భయం ఇంకా తగ్గలేదు. అవుట్ డోర్ షూటింగ్ కు ఈ మధ్య బాగానే బ్రేకులు పడ్డాయి. ఇక పుష్ప సీన్స్ ను చాలా వరకు ఫారెస్ట్ లలోనే చిత్రీకరించాలి కాబట్టి అధిక సంఖ్యలో యూనిట్ సభ్యులు పాల్గొనాల్సి వస్తోంది.

అయితే కొన్నాళ్ల పాటు షూటింగ్ ను జనాలు పెద్దగా అవసరం లేకుండా కొనసాగించాలని అనుకున్న సుకుమార్ ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని సెట్స్ ను ఏర్పాటు చేయిస్తున్నారట. రామోజి ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేయబోయే ఆ సెట్స్ లో వీలైనంత వరకు కొన్ని సీన్స్ ను పూర్తి చేసి కీలకమైన సీన్స్ ను మళ్ళీ అసలైన అడవులలో షూట్ చేస్తారట. నిజంగా ఈ తరహాలో షూటింగ్ చేయాలి అంటే అలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మరి ఈ ప్రయోగాన్ని సుకుమార్ ఎంతవరకు సక్సెస్ చేస్తాడో చూడాలి. ఇక న్యూ ఇయర్ కానుకగా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











