మహేష్ బాబును కలిసిన డైరెక్టర్ సుకుమార్.. షూటింగ్ లోనే ముచ్చట్లు.. ఫొటో వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దాదాపు స్టార్ దర్శకులు అందరితోనూ చాలా సన్నిహితంగా ఉంటారు. దర్శకులను ఎక్కువగా నమ్మే హీరోలలో హీరో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక దర్శకుడిని ఎంతగా నమ్ముతాడు అంటే ఒక్కసారి స్క్రిప్ట్ ఓకే చేస్తా ఆ తర్వాత డైరెక్టర్ ఏది చెబితే అది చేస్తాడు. మధ్యలో ఏమాత్రం వేలుపెట్టే ప్రయత్నం చేయడు. ఆ విషయంలో దర్శకులు చాలా వరకు మహేష్ బాబును ఎంతో గౌరవిస్తారు. మహేష్ బాబు అంటే డైరెక్టర్స్ హీరో అనే ఒక మంచి ట్యాగ్ అయితే ఉంది. ఇక మహేష్ బాబు కూడా నిర్మాత దర్శకులకు చాలా గౌరవం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తరహాలోనే మంచి క్రేజ్ అందుకోవడమే కాకుండా మంచి మనసున్న వ్యక్తి గా కూడా మహేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్నాడు

అయితే కొందరు దర్శకులు మాత్రం అప్పుడప్పుడు మహేష్ బాబు మీద అప్సెట్ అవుతుంటారు అని రూమర్స్ వచ్చాయి గతంలో పూరీ జగన్నాథ్ మహేష్ బాబుకు పోకిరి బిజినెస్ మాన్ వంటి హిట్ సినిమాలు ఇచ్చినా కూడా తాను ప్లాప్ లో ఉన్నప్పుడు సినిమా చేసే అవకాశం ఇవ్వలేదని కామెంట్ చేశాడు. ఆ కామెంట్స్ అప్పట్లో చాలానే వైరల్ అయ్యాయి. కానీ మహేష్ అభిమానులు మాత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే బాగుంటుందని చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ తో కూడా మహేష్ కు అప్పట్లో కొంత విభేదాలు వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.

Director sukumar met mahesh babu yesterday in hyderabad

అసలు పుష్ప సినిమా కంటే ముందే మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సింది. కానీ మహేష్ బాబు కథపై అనేక రకాల మార్పులు కావాలని చెప్పి చివరికి రిజెక్ట్ చేయడంతో సుకుమార్ కాస్త అప్సెట్ అయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇటీవల మరొక ఫోటో తో క్లారిటీ గా అర్థమైంది. అప్పుడప్పుడు మహేష్ సుకుమార్ కలుసుకుంటూనే ఉంటున్నారు. ఇక సుకుమార్ మరోసారి సూపర్ స్టార్ ను ఒక యాడ్ షూట్ లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. వీరు మాట్లాడుకుంటున్నా ఫోటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరి మీటింగ్ వెనక ఎప్పటిలానే అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి గతంలో మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వన్ నేనొక్కడినే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అనుకుంది. అయినప్పటికీ వీరి కాంబినేషన్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు రెండో సినిమాపై ఏమైనా ఆలోచిస్తున్నారో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 1 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో ఆ సినిమా విడుదల కానుంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం పుష్ప 2ని విడుదల చేస్తారు. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాటతో సినిమాతో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X