దట్టమైన అడవుల్లో సుకుమార్ గ్యాంగ్ సెర్చింగ్.. పుష్ప కోసం న్యూ ప్లాన్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తనికి పాన్ ఇండియా సినిమాను బాగానే సెట్ చేసుకున్నాడు. అల.. వైకుంఠపురములో సినిమాతో అలా హిట్టు అందుకోగానే వెంటనే స్ట్రాంగ్ కంటెంట్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ ని టార్గెట్ చేశాడు. పుష్ప సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇక సినిమా షెడ్యూల్ పై చిత్ర యూనిట్ కొత్త నిర్ణయానికి వచ్చింది.

పుష్ప షూటింగ్ మొదలవ్వగానే సుకుమార్ కేరళ అడవులను ఎక్కువగా ఫోకస్ చేశాడు. అక్కడే కొన్ని సీన్స్ ని చిత్రీకరిస్తుండగా సడన్ గా లాక్ డౌన్ దెబ్బ పడింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆగిపోయిన షూటింగ్ ని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే పుష్ప టీమ్ కేరళకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇక్కడే ఉన్న ప్రకృతిని వాడుకోవాలని సుకుమార్ టీమ్ సిద్ధమైంది.

Director sukumar new plan for pushpa movie reschedule

గత కొన్ని రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ అలాగే ఆంద్రప్రదేశ్ లోని మారేడ్ పల్లి అడవులను పరిశీలిస్తున్న పుష్ప టీమ్ దాదాపు సినిమాకు తగిన లొకేషన్స్ ని సెలెక్ట్ చేసుకుందట. ప్రస్తుతం కొత్త షెడ్యూల్స్ కోసం కొత్త ప్లాన్ సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఫారెస్ట్ కి సంబంధించిన సీన్స్ ని ఫినిష్ చేసి మిగతా షూటింగ్ ని హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోలలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X