ఆ సినిమాతో డైరెక్షన్ వదిలేద్దామనుకున్న.. సుకుమార్ కు కోలుకోలేని దెబ్బ

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. చివరిగా పుష్ప 2 : ది రూల్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పుష్ప మ్యానరిజంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీకి దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ మంచి డిమాండ్ ఉండింది. ఈ చిత్రం తర్వాతనే సుకుమార్ కూ ఓవర్సీస్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక తాజాగా అమెరికాలో నిర్వహించిన NATs 2025 ఈవెంట్ లో పాల్గొని ఇలా మాట్లాడారు. తన కెరీయర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సుక్కును టాప్ లో నిలబెట్టిన చిత్రాలు..
లెక్కల మాస్టర్ గా ఉన్న సుకుమార్ టాలీవుడ్ లోకి అల్లు అర్జున్ 'ఆర్య' చిత్రంతో అడుగుపెట్టాడు. సుకుమార్ కు ఇది తొలిచిత్రం. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజ్ నిర్మించారు. ఆ తర్వాత జగడం, ఆర్య 2, 100% లవ్, 1 నెనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప : ది రైజ్, పుష్ప 2 ది రూల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. రంగస్థలం నుంచి సుకుమార్ వరుసగా హిట్స్ కొడుతూనే వస్తున్నారు. ఈ చిత్రాల్లో ఆర్య, 100%లవ్, రంగస్థలం చిత్రాలు టాప్ లో నిలబెట్టాయి.

Director Sukumar Once Decided to Give up Direction

మహేశ్ బాబు సినిమానే లాస్ట్ అయ్యేది..
సుకుమార్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో పని చేశారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో క్రేజీ ప్రాజెక్ట్స్ ను డైరెక్ట్ చేశారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించిన చిత్రం 1: నేనొక్కడినే భారీ డిజాస్టర్ ను అందించింది. అయితే ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. కానీ ఓవర్సీస్ లో మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఓవర్సీస్ లోనూ ఆడకపోతే ఆ చిత్రం తర్వాత డైరెక్షన్ వదిలేద్దామని అనుకున్నారంట. ఈ విషయమైన తాజాగా మాట్లాడారు.

NATs ఈవెంట్ లో..
తాజాగా యూఎస్ లో నార్త్ అమెరికా తెలుగు సోసైటీ (NATs) సంబరాలకు తెలుగు చిత్ర పరిశ్ర నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజ్, అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్ర రావుతో పాటు మరికొంత మంది సినీ తారలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేశారు. ఇక సుకుమార్ మాట్లాడుతూ 1: నేనొక్కడినే చిత్రం తర్వాత దర్శకత్వం మానేద్దామని అనుకున్నాను. మీరు ఓవర్సీస్ లో చూడకపోతే నాకు అదే లాస్ట్ సినిమా అయ్యేది. మరో సినిమా అవకాశం వచ్చేది కాదని చెప్పుకొచ్చారు. నార్త్ అమెరికా తెలుగు ఆడియెన్స్ కు జీవితాంత రుణపడి ఉంటానని చెప్పారు. ప్రస్తుతం సుకుమార్ మాటలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Read more about: sukumar mahesh babu pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X