విజయ్ దేవరకొండతో సుకుమార్ ప్యాన్ ఇండియా మూవీ.. యువ నిర్మాత టాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అర్జున్‌రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండ కెరీర్ మరో లెవెల్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆయన ఎంచుకొన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. విజయ్ దేవరకొండ నటనకు సినీ ప్రేక్షకులే కాకుండా సినీ తారలు కూడా ఫిదా అవుతున్నారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి పోటీ పడతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
లాక్‌డౌన్‌లో అగ్ర దర్శకులతో భారీ బడ్జెట్ చిత్రాలకు విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నారనే వార్తలకు బలాన్ని ఇస్తూ.. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన సుకుమార్‌తో జత కడుతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేదార్ సెలగమ్‌శెట్టి రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంతో కేదార్ నిర్మాతగా మారారు. భవిష్యత్‌లో మరిన్నీ ప్రాజెక్టులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. యువ నిర్మాత కేదార్ సెలగమ్‌శెట్టి జన్మదినాన్ని పురస్కరించుకొని విజయ్ దేవరకొండ, సుకుమార్ ప్రాజెక్టును ప్రకటించారు.
ఈ సందర్బంగా నిర్మాత కెదార్ సెలగమ్‌శెట్టి మాట్లాడుతూ.. నా జీవితంలో గుర్తుండిపోయే రోజు. విజయ్ దేవరకొండ, సుకుమార్ అంటే నాకు వ్యక్తిగతం ఇష్టం. వారితో సినిమా రూపొందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. వారితో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నానని తెలియజేయడం సంతోషంగా ఉంది. విభిన్నమైన, విలక్షణమైన చిత్రాలకు విజయ్, సుకుమార్ పెట్టింది పేరు. ఈ సినిమా వారి స్టైల్ ప్రకారం ఉంటుంది. ప్యాన్ ఇండియాగా రూపొందే ఈ సినిమా 2022లో ప్రారంభమవుతుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











