నీవు లేకపోతే ప్లే బ్యాక్ లేదు.. బీ నాగేశ్వర్ రెడ్డిపై సుకుమార్ ప్రశంసలు
గతవారం అంటే మార్చి 5వ తేదీన రిలీజైన చిత్రాలన్నింటిలోను ఫీల్‌గుడ్ టాక్ సొంతం చేసుకొన్న చిత్రం ప్లే బ్యాక్. ఈ చిత్రం దినేష్ తేజ్, అనన్య నాగళ్ల, టీఎన్ఆర్, టీవీ5 మూర్తి తదితరుల నటించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంపై సినీ విమర్శకులతోపాటు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్లే బ్యాక్ మూవీ సక్సెస్ మీట్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. టెక్నికల్ టీమ్‌ను అభినందించారు.
ప్లే బ్యాక్ మూవీ సక్సెస్ మీట్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. ఎడిటర్ బీ నాగేశ్వర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్లే బ్యాక్ సినిమాకు నీవు లేకపోతే సినిమా లేదు. మంచి ఎడిటర్ ఆయన. టీజర్, ట్రైలర్ చాలా చక్కగా కట్ చేశారు. ప్లే బ్యాక్ లాంటి సినిమాకు ఎడిటర్ వర్క్ చాలా కీలకం. మీరు ఈ సినిమాకు చేసిన ఎడిటింగ్ చాలా బాగుంది. గుడ్ లక్ అంటూ నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు.

బీ నాగేశ్వర్ రెడ్డి (బీఎన్ఆర్) కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో మంచి సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నీది నాది ఒకే కథ, మన్మథుడు 2, ప్లే బ్యాక్ చిత్రాలకు పనిచేశారు. లాక్‌డౌన్ తర్వాత పలు చిత్రాలకు పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











