నా జర్నీ అంతా చెండాలం .. సుకుమార్ సంచలన వ్యాఖ్యలు , పుష్ప విడుదల వేళ వీడియో వైరల్
చిత్ర సీమలో ఎన్నో విభాగాలు ఉన్నప్పటికీ డైరెక్టర్‌ది కీ రోల్. 24 క్రాఫ్ట్స్ నుంచి తనకు కావాల్సిన ఔట్‌పుట్ రాబట్టంతో పాటు కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా దర్శకుడిని అభివర్ణిస్తారు. డైరెక్టర్ అనే వ్యక్తి ఎంత సమర్ధుడన్న దానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చోబెట్టిన వాడే ఈ ఫీల్డ్‌లో విజేత. ఈ పరుగు పందెంలో విజయం సాధించినవాళ్లు కొందరే. ఇలాంటి వారిలోనూ స్టార్ డైరెక్టర్లు కొందరే. ఈ కోవలోకే వస్తారు సుకుమార్.
లెక్కల మాస్టర్ స్థాయి నుంచి దర్శకుడిగా ఎదిగారు సుకుమార్. మూసలో కొట్టుకుపోకుండా విభిన్నమైన కథలతో క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్నారు సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్యతో వెండితెరకి పరిచయం అయ్యారు సుక్కు. తొలి సినిమాతోనే డిఫరెంట్ సబ్జెక్ట్ డీల్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వెంటనే చాక్లెట్ బాయ్ రామ్ హీరోగా తెరకెక్కిన జగడం కమర్షియల్ హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఆ వెంటనే మరోసారి అల్లు అర్జున్‌తో ఆర్య 2, నాగచైతన్యతో 100 % లవ్‌లు తీసి ట్రాక్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకుని ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాడు. అదే వన్ నేనొక్కడినే. టాలీవుడ్‌లో గతంలో ఎన్నడూ రాని విధంగా డిఫరెంట్ టేకింగ్‌తో ఈ సినిమాను తీశాడు సుకుమార్. ఇది కూడా కమర్షియల్‌గా హిట్ కాలేకపోయినా .. సుకుమార్ డైరెక్షన్‌కి, మహేశ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ రావడం విశేషం .
అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాలు తీసి టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించాడు. ఇక అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్పతో దేశాన్ని ఒక ఊపారు. ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. మరో నెల రోజుల్లో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడిగానే కాదు నిర్మాతగానూ సుకుమార్ సక్సెస్ అయ్యారు. సుకుమార్ రైటింగ్స్ పేరిట బ్యానర్ స్థాపించి తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారికి దర్శకుడిగా అవకాశమిచ్చి ప్రోత్సాహం కల్పించారు.
దర్శకుడిగా, నిర్మాతగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సుకుమార్‌ను చిత్ర పరిశ్రమలో అంతా ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. మీడియాకు, పబ్లిసిటీకి దూరంగా ఉండే సుకుమార్ వివాదాలకు, కాంట్రవర్సీల జోలికి వెళ్లారు. తాజాగా కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యల వీడియో దుమారం రేపుతోంది. కథ రాసేటప్పుడు కానీ, సినిమా తీసేటప్పుడు కానీ ఈరోజు ఎంజాయ్ చేయాలని అంటూ ఉంటారని, రిజల్ట్ ఇంపార్టెంట్ కాదని, జర్నీ చాలా అందంగా ఉండాలని చెబుతారని సుకుమార్ అన్నారు. అదేంటో కానీ నా జర్నీ ఎప్పుడూ అందంగా ఉండదని , చాలా బాధపడుతూనే ప్రయాణం కొనసాగిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ నాకు ఒక్క రిజల్ట్ రోజు మాత్రం చాలా ఇంపార్టెంట్ అని సుకుమార్ తెలిపారు. అయితే త్వరలో పుష్ప 2 రిలీజ్ కానుండటంతో సుకుమార్ మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తలో రకంగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











