ఆ నలుగురికి సుకుమార్ ఛాలెంజ్.. రాజమౌళి సవాల్‌కు స్పందన
టాలీవుడ్‌లో #BeTheREALMAN అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్‌కు సినీ ప్రముఖులంతా భారీగా స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంటి పనుల్లో మగవాళ్లు చేయూతనందించాలి. వంటగదిలోనూ, ఇంటి పనుల్లోనూ భాగం కావాలని సందీప్ రెడ్డి వంగా ప్రారంభిన ఈ ఛాలెంజ్‌ను అందరూ సానుకూలంగా స్వీకరిస్తున్నారు.
సందీప్ రెడ్డి ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టి రాజమౌళికి ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. రాజమౌళి ఇంటిపనుల్లో భాగమయ్యారు ఆ తర్వాత సుకుమార్‌తోపాటు పలువురికి ఛాలెంజ్ విసిరారు. ఈ క్రమంలో రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌కు సుకుమార్ స్పందించి ఇంటి పనులు చేశారు.

చిపిరి కట్ట పట్టుకొని ఇంటిని శుభ్రం చేయడం, వంటింట్లో పాత్రలు కడిగి తన వంతు బాధ్యతగా ఛాలెంజ్‌ను స్వీకరించారు. అనంతరం సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, సురేందర్ రెడ్డి, కొరటాల శివ, దిల్ రాజును నామినేట్ చేశారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత ప్రస్తుతం పుష్ప అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, నివేదా థామస్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ కరోనావైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











