క్షుద్రపూజలతో సాయి ధరమ్ తేజ్ పోరాటం.. సుకుమార్ కూడా ఆ రూట్‌లోనే!

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు క్లిక్కవ్వాలి అంటే విడుదలకు ముందే ప్రమోషన్స్ డోస్ పెంచాల్సి ఉంటుంది. లేదా మంచి సాంగ్స్ తో సినిమాపై అంచనాలను పెంచాల్సి ఉంటుంది. అయితే హారర్, థ్రిల్లర్ సినిమాలకు అలాంటివేమీ అవసరం లేదు. విడుదలైన రోజు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైనట్లే. సాయి ధరమ్ తేజ్ కూడా కెరీర్ లో మొదటిసారి అలాంటి సినిమాతో రావడానికి సిద్ధమయ్యాడు.

వైరల్ అవుతున్న రూమర్స్

వైరల్ అవుతున్న రూమర్స్

అసలు మ్యాటర్ లోకి వస్తే సాయి ధరమ్ తేజ్, సుకుమార్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇంతవరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. కేవలం ఒక ఎనౌన్స్మెంట్ పోస్టర్ ని మాత్రమే వదిలారు. ఇక రోజుకో రూమర్ వైరల్ అవుతోంది.

సక్సెస్ ట్రాక్ ను అలానే కొనసాగించాలని..

సక్సెస్ ట్రాక్ ను అలానే కొనసాగించాలని..

సాయి ధరమ్ తేజ్ వరుస అపజయాల తరువాత ప్రతి రోజు పండగే సినిమాతో అసలైన బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గతే ఏడాది క్రిస్టమస్ కి విడుదలైన ఆ సినిమా సాయి కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఆ సక్సెస్ ట్రాక్ ను అలానే కొనసాగించాలని డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

మొదటిసారి సుకుమార్ ప్రయోగం

మొదటిసారి సుకుమార్ ప్రయోగం

ఇక హారర్, థ్రిల్లర్ సినిమాలను చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్న మెగా హీరోకు సుకుమార్ రైటింగ్స్ ద్వారా అవకాశం దక్కింది. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్ మొదటిసారి కొత్త జానర్ ని టచ్ చేస్తున్నాడు. ఆయన రాసిన స్క్రీన్ ప్లేతో రాబోతున్న ఈ త్రిల్లర్ సినిమాలో సాయి నెవర్ బిఫోర్ లుక్కుతో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అవుతోంది.

Recommended Video

Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
1970 బ్యాక్ డ్రాప్ లో..

1970 బ్యాక్ డ్రాప్ లో..

సినిమాలో హారర్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉండకపోయినా మిస్టరీకి సంబంధించిన సీన్స్ చాలానే ఉంటాయట. 1970ల కాలంలో సినిమా కథ కొనసాగుతుందట. ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా స్క్రిప్ట్ ను రేడి చేశారని సమాచారం. సాధారణంగా సుకుమార్ రైటింగ్స్ అంటే ఎక్కువగా ప్రేమ కథలు వస్తుంటాయి. అయితే ఈ సారి ఆ టాక్ కు ఈ సినిమా ఎండ్ కార్డ్ పెట్టనుంది. ఇక సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X