వెండితెరపై లాక్‌డౌన్ ‘వలస’ జీవుల వెతలు.. సునీల్ కుమార్ దర్శకత్వంలో మరో..

సొంతూరు, గంగపుత్రులు లాంటి సామాజిక అంశాలతో ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి నుంచి వస్తున్న మరో చిత్రం వలస. లాక్‌డౌన్‌లో దేశవ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను కదిలించిన వలస జీవుల జీవితాలను కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపందించారు. యెక్కలి రవీంద్రబాబు నిర్మాతగా, శ్రావ్య ఫిల్మ్స్, కళాకార్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందించిన వలస చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు విశాఖపట్టణంలో శరవేగంగా జరుగుతున్నాయి.

కోవిడ్ 19 పరిస్థితులు దేశవ్యాప్తంగా మధ్య, దిగువ తరగతి కార్మికులు, వేతన జీవుల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీ దిశగా అడుగులు పడ్డాయి. అన్ని వర్గాల కార్మికులు, ప్రజలు వెతలు మాటల్లో చెప్పని విధంగా మారాయి. ఇలాంటి వ్యధ భరితమైన జీవితాలను తెరపైన ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సునీల్ కుమార్.

Director Sunil Kumar Reddy’s Valasa to hit Theatre soon

లాక్‌డౌన్ కాలంలోనే కథ, కథనాలు పూర్తి చేసుకొని.. నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌ పూర్తి చేశారు. మనోజ్ నందమ్, వినయ్ మహాదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. తేజు, గౌరీలు హీరోయిన్లుగా నటించారు. తనుషా, తులసీ రామ్, మనీషా, ఎఫ్ బాబాయ్, సముద్ర వెంకటేష్, నల్ల శ్రీను, మల్లిక, చిన్నారి, సాజిద్, రామన్, వాసు తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.

వలస చిత్రానికి సంగీతం ప్రవీణ్ ఇమ్మడి, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నరేష్ కుమార్ మాడికి, కలరింగ్ శ్యామ్ కుమార్ పీ, ఆడియోగ్రఫి ప్రదీప్, కథ, స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పాటలు: సునీల్ కుమార్ రెడ్డి అందించారు. త్వరలోనే థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X