స్క్రీన్‌పై స్వయంగా రాజన్నే కనిపించారు.. యాత్రపై సురేందర్ రెడ్డి ప్రశంసలు!
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2003లో చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర చిత్రం రూపొందించబడింది. మహి వి రాఘవ్ వైఎస్ఆర్ జర్నీని యాత్ర చిత్రంలో ఎమోషనల్ గా చూపించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. యాత్ర చిత్రాన్ని దర్శకుడు మహి వి రాఘవ్ ఎమోటినల్ గా నడిపించారు. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ దిగ్గజం మమ్ముట్టి నటించారు. యాత్ర చిత్రంపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి యాత్ర మూవీపై తన స్పందన తెలియజేశారు. యాత్ర చిత్రాన్ని చూశా. ఈ చిత్రం నాకు ఎమోషనల్ జర్నీగా అనిపించింది. చాలా సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. మమ్ముట్టి అద్భుతంగా నటించారు. మమ్ముట్టి నటనతో రాజన్నే స్వయంగా వెండితెరపై కనిపించారనిపించింది. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని సురేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.

దర్శకుడు మహి వి రాఘవ్ కేవలం వైఎస్ఆర్ పాదయత్రని కథాంశంగా తీసుకుని తెరకెక్కించారు. ప్రముఖ నటుడు రావు రమేష్ కెవిపి రామచంద్రరావు పాత్రలో నటించాడు. అనసూయ, పోసాని తదితర నటులు కీలక పాత్రల్లో నటించారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలవెనుక ఉన్న కారణాలని దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రం ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.


Click it and Unblock the Notifications











