‘డైరెక్టర్ సురేందర్ రెడ్డికి కరోనా.. వెంటిలేటర్‌పై 20 రోజులు’

అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని, సెన్సేషనల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఏజెంట్. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమైంది. నిర్మాతలు అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏజెంట్ ట్రైలర్‌ను ఏప్రిల్ 18న అభిమానుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సురేందర్ రెడ్డి, అఖిల్, సాక్షి వైద్య, డినో మారియా, అనిల్ సుంకర, రసోల్ ఎల్లోర్ పాల్గొన్నారు.

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సినిమాకి కష్టపడ్డామని చెబుతుంటాం. కానీ ఏజెంట్ సినిమా కోసం బాగా కష్టపడింది అఖిల్ మాత్రమే. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమాపై వర్క్చేస్తున్నాం. ప్రతీ రోజు వర్కవుట్ చేస్తూ ఏడాదిన్నరపాటు బాడీ మెయింటెన్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఒక్క రోజు కూడా అలసట చెందలేదు. సినిమా కోసం చాలా డెడికేటడ్‌గా వర్కువుట్స్ చేశారు అని అన్నారు.

Surender Reddy

నిర్మాత అనిల్ సుంకర లేకపోతే ఏజెంట్ సినిమా లేదు. ప్రతీ విషయంలోను మా వెనుక ఉండి నడిపించారు. ఈ సినిమాలో మరో హైలెట్ సూపర్ స్టార్ మమ్ముటి. ఆయన సహకారం గొప్పగా అందించారు. సినిమా లేట్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఏ రోజు రమ్మంటే ఆ రోజు షూటింగ్‌కు వచ్చారు. ఆయనతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.

బాలీవుడ్ నటుడు డినో మారియా ఇందులో చాలా కొత్తగా కనిపిస్తారు. ఎలాంటి అనుభవం లేని నూతన నటి సాక్షి వైద్య చాలా చక్కగా చేసింది. ఆమెకు మంచి భవిష్యత్ ఉందనే నమ్మకంతో ఉన్నాను. ఈ సినిమా లుక్ ఇంత బాగా వచ్చిందంటే కేవలం సినిమాటోగ్రాఫర్ రసూల్ కారణం. ఈ సినిమా షూటింగ్ ఎన్నో అనుభూతులు పంచింది అని సురేందర్ రెడ్డి చెప్పారు.

ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28‌ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరవేడయానికి మీడియా సహకారం కావాలి. ఏజెంట్ ప్రేక్షకులు, అభిమానులు అంచనాలు తగ్గట్టు ఉంటుంది. అఖిల్ ఇప్పటివరకూ చేసింది ఒక ఎత్తు.. ఏజెంట్ మరో ఎత్తు. అఖిల్ ఎలాంటి పాత్రనైనా చేయగలుగుతాడు. నేను ఒక 50 శాతం మాత్రమే రాబట్టగలిగాను. ఈ సినిమాని అఖిల్ మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలరు. ఈ సినిమా అఖిల్ కోసమే చేశాను. 100 శాతం న్యాయం చేశాననే అనుకుంటున్నాను. అఖిల్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాని గర్వంగా చెబుతున్నాను అని సురేందర్ రెడ్డి అన్నారు.

తాను ఏజెంట్ సినిమా నుంచి తప్పుకొన్నట్టు వచ్చిన వార్తలను సురేందర్ రెడ్డి తప్పుపట్టారు. బుడాపెస్ట్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో నేను కరోనా బారిన పడ్డాను. దాదాపు 6 నెలలు బుడాపెస్ట్ హాస్పిటల్‌లో ఉన్నాను. అందులో 20 రోజులు వెంటిలేటర్‌పైనే ఉన్నాను. బయటకు రాగానే నేను బతికాను. ఏదో ఒకటి చేయాలి. ఇదే చేస్తాను అని సురేందర్ రెడ్డి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X