SV Krishna Reddy: "గుంటూరుకారం తేడా కొట్టడానికి కారణం అదే..అలా ఎప్పుడూ చేయకూడదు"
సూపర్ సస్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన తాజాసినిమా గుంటూరు కారం గురించి అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో దాదాపు పదమూడేళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదల అయింది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమాసూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.
బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టుకున్నప్పటికున్న గుంటూరు కారం సినిమా చాలా మందిని మాత్రం మెప్పించలేకపోయింది. ముఖ్యంగా మహేష్ బాబు ప్యాన్స్ తో పాటు గురూజీ ఫ్యాన్స్ ఇలాంటి సినిమాను అస్సలే ఎక్స్ట్ పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా అతడు, ఖలేజా స్థాయిలో ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ సినిమా తేడీ కొట్టడంతో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రీవ్యూలు ఇచ్చారు. సినిమా బాగుందని కొందరు, ఫర్వాలేదని మరికొందరు.. గురూజీ మార్క్ కనిపించలేదంటూ సోషల్ మీడియా వేధికగా స్పందించారు.

అయితే తాజాగా మహేష్ బాబు హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా చేసిన గుంటూరు కారం సినిమాపై ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి స్పందించారు. ఈ సినిమా తేడా కొట్టడానికి గల కారణాల గురించి వివరించారు. భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకోకపోవడాని అసలైన కారణం ఏంటో చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడైనా సరే సినిమాలను కథను బేస్ చేసుకుని మాత్రమే తీయాలని ఎస్వీ కృష్ణారెడ్డి వివరించారు. కథ బలంగా ఉంటేనే సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తాయని.. పెద్ద హీరోలు, స్టార్ నటీనటుల కోసం సినిమాను ఏమాత్రం మార్చినా, కాస్త అటూ ఇటూ చేసిన ఫలితాలు తేడా కొట్టేస్తాయని అన్నారు. తాను కథను నమ్ముకుని తీసిన అనేక చిత్రాలు హిట్లు అయ్యాయని.. హీరోల కోసం కాస్త మార్పులు, చేర్పులు చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాగే చేశారని అన్నారు.

మహేష్ బాబు స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎమోషన్లను పెట్టారని.. అవే ఈ సినిమాకు మైనస్ అయ్యాయని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం కథను నమ్ముకోలేదని.. మహేష్ బాబు కోసం మాత్రం కథను మార్చినట్లు అనిపించిందని.. అన్నారు. అందుకే ఆ సినిమా తేడా కొట్టేసిందని చెప్పుకొచ్చారు. తాను కూడా గతంలో ఇలా చేయగా ఆ సినిమాలను ఎవరూ ఆదరించలేదని.. కానీ కథను నమ్ముకుని తీసిన అన్ని సినిమాలు ఆల్ టైమ్ హిట్లుగా మారాయని గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications











