twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Masooda రొటీన్ సినిమా కాదు.. భయంతో ఒళ్లు జలదరిస్తుంది.. మసూదపై యువ దర్శకుల ప్రశంసలు

    |

    మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి థ్రిల్లర్ తర్వాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తన మూడవ చిత్రంగా నిర్మించిన హారర్ డ్రామా చిత్రం మసూద. యువ దర్శకులు ఏజెంట్ సాయి శ్రీనివాస దర్శకుడు స్వరూప్ అర్. ఎస్. జే., కేరాఫ్ కంచర పాలెం దర్శకుడు వెంకటేశ్ మహా, అంటే సుందరానికీ... దర్శకుడు వివేక్ ఆత్రేయ, మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు వినోద్ అనంతోజు, కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే... హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు.

    ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే వారికి కలిగిన అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు. ఈ జానర్ లో ఇంకొన్ని కథలు రావటానికి మసూద ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మా చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని మెప్పించిందో మసూద కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. ఈ కథను నమ్మి హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు. దర్శకుడు సాయి కిరణ్ గురించి మాట్లాడుతూ... కథలోనే హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు, అలా క్రియేట్ చేయడం చాలా కష్టమని, ఆ విషయంలో దర్శకుణ్ణి అభినందించారు. ఈ చిత్రానికి సౌండ్ అండ్ విజువల్ ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు.

    Director Swaroop RSJ, Venkatesh Maha, Vivek Atreya, Vinod Anamtoj, Sandeep Raj about Masooda movie

    ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ మాట్లాడుతూ.. 'సరైన హారర్ సినిమాగా మసూద వస్తోంది. ఇలాంటి చిత్రాలను థియేటర్లో చూస్తేనే థ్రిల్ ఫీలింగ్ వస్తుంది. మేం సినిమాను చూస్తూ ఎంత ఎంజాయ్ చేశామో మీరు చూసినపుడు మీకు కూడా అర్థమవుతంది. అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతంగా పని చేశాయి. రేపు ఆడియెన్స్ ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు.

    కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. 'మళ్లీ రావా, ఏజెంట్ చిత్రాల తరువాత రాహుల్ ఎలాంటి సినిమా తీస్తారో అనుకున్నాను. హారర్ సినిమా అని చెప్పినప్పుడు.. రొటీన్ అని అనుకున్నాను. కానీ సినిమా చూసిన తరువాత షాక్ అయ్యాను. చాలా చోట్ల కచ్చితంగా భయపడతాం. డెబ్యూ డైరెక్టర్‌ తీసిన సినిమాగా అనిపించదు. సరైన టీం కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. మ్యూజిక్, సౌండ్, కెమెరా అన్నీ చక్కగా కుదిరాయి. మీరు కూడా థియేటర్లో ఆ ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటున్నాను' అని అన్నారు.

    Director Swaroop RSJ, Venkatesh Maha, Vivek Atreya, Vinod Anamtoj, Sandeep Raj about Masooda movie

    వెంకటేష్‌ మహా మాట్లాడుతూ.. 'హారర్ జానర్‌ తీయాలనే ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడున్న దర్శకులు అంటున్నారు. నేను కూడా అన్నాను. కానీ నేను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. హారర్‌ను ఫుల్లుగా ఎక్స్‌పీరియెన్స్ చేశాను. చాలా భయపడ్డాను. సాయి విజన్‌కు తగ్గట్టుగా అద్భుతంగా విజువలైజ్ చేశారు. ఇది విజువల్ హారర్ ఫిల్మ్. సౌండింగ్, మ్యూజిక్ పరంగానూ అద్భుతంగా పని చేశారు. హారర్ అంటే కామెడీ, మసాలా ఉండాలని అనుకునే సమయంలో.. ఇలాంటి కథను నిర్మించిన రాహుల్‌కు థాంక్స్. సినిమాలపరంగా రాహుల్ నాకు సోల్ మేట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.

    మిడిల్ క్లాస్ మెలోడిస్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం హారర్ ఫార్మాట్ రొటీన్ అయింది. అందులోనూ కొత్త ఎలిమెంట్, పాయింట్ తీసుకోవడం బాగుంటుంది. దెయ్యాన్ని చూస్తే వచ్చే భయం కాదు. ఆ సీన్‌లోంచి, వాతావరణంలోంచి భయాన్ని క్రియేట్ చెయ్యటం మామూలు విషయం కాదు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల్లోనే భయపెట్టేస్తాడు. ఇదేదో తేడాగా ఉందే అనే భయం కలుగుతుంది. టీం అంతా కలిసి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఫోన్‌లో చూస్తే ఈ ఎక్స్‌పీరియెన్స్ రావడం చాలా కష్టం. థియేటర్లోనే ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథను నమ్మి తీసిన రాహుల్‌కు థాంక్స్. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. తప్పకుండా చూడండి' అని అన్నారు.

    వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. 'రాహుల్, ప్రశాంత్ నాకు మంచి ఫ్రెండ్స్. ప్రీమియర్స్‌కు పిలిచారు. అమ్మోరు, కాంతారా ప్రపంచంలో మనం ఉన్నప్పుడు.. పాత్రలకు ఏమైనా జరుగుతూ ఉంటే మనం భయపడుతుంటాం. ఈ చిత్రంలోనూ అలాంటి ఫీలింగ్ వస్తుంది. హారర్ సినిమా చేయాలంటే టెక్నికల్‌గా ఎంతో నాలెడ్జ్ ఉండాలి. సాయి మొదటి సినిమానే ఇలా చేయడం చాలా గ్రేట్. సంగీత, తిరువీర్, కావ్యా, శుభలేఖ సుధాకర్ ఇలా అందరూ చక్కగా నటించారు. బెలూన్ సౌండ్‌కి కూడా నా గుండె ఝల్లుమంది. రాత్రి ఇంటికి వెళ్లి ఒంటరిగా భోజనం చేయాలన్నా కూడా భయంగా అనిపించింది. హారర్ సినిమాకు ఆర్ఆర్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆర్ఆర్, విజువల్స్ అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్లోనే చూస్తేనే ఈ ఫీలింగ్ వస్తుంది. మసూద రేపు విడుదల కాబోతోంది. థియేటర్లోనే ఈ సినిమాను చూడండి' అని కోరారు.

    సాయి కిరణ్ మాట్లాడుతూ.. 'మంచి సినిమాను తీశాం. ఫలితం ఎలా వస్తుందనే ఆలోచన అయితే ఉంది. నాకు ఆఫర్ ఇచ్చినందుకు రాహుల్‌కు థాంక్స్. ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మసూద కల్పిత చిత్రమే. ఇందులో మసూద నెగెటివ్ పాత్ర. ఆమె కోణంలోంచి సినిమా నడుస్తుంది. కాబట్టే ఈ చిత్రానికి మసూద అని టైటిల్ పెట్టాం. మీ అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను' అని అన్నారు.

    English summary
    Masooda is set to release on November 18th. Actor Tiruveer, Sangeeta, Kavya Kalyan Ram in lead role. As part of the promotions, Producer Rahul Nakka reveals important things about the Masooda. In this occassion, Director Swaroop RSJ, Venkatesh Maha, Vivek Atreya, Vinod Anamtoj, Sandeep Raj about Masooda movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X