twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోగా తరుణ్ భాస్కర్?. పెళ్లిచూపులు డైరెక్టర్ లుక్ కేక..

    |

    ఆర్టిస్టుగా విజయ్ దేవరకొండ చిన్న చిన్న వేషాలతో సినిమాలు చేస్తుంటే.. పెళ్లి చూపులు మూవీతో ఆయనను హీరోగా నిలబెట్టింది తరుణ్ భాస్కర్ అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో రెండో విఘ్నాన్ని దాటాడు. మూడో సినిమా ఎప్పుడని ఎదురుచూస్తుండగా ఈ క్రేజీ డైరెక్టర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు.

    విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తరుణ్ భాస్కర్ తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకొన్నాడు. లావుగా, బొద్దుగా ఉండే ఈ డైరెక్టర్ సన్నగా, నాజుకుగా మారిపోయాడు. తాజాగా నెట్‌లో బయటకు వచ్చిన తరుణ్ భాస్కర్ ఫొటో వైరల్‌గా మారింది.

    Director Tarun Bhasker look goes viral

    విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్‌గా రూపొందించే చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా మూడు జంటల మధ్య జరిగే కథతో తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే అధికారికంగా నటీనటులు, సాంకేతిక విభాగాల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

    ఇక విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్ధంగా ఉన్నది. అలాగే క్రాంతి కుమార్ దర్శకత్వం వహించే మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. హీరోగా నటిస్తూనే చిన్న సినిమాలకు నిర్మాతగా మారాలనే ప్రయత్నంతో సొంత నిర్మాణ సంస్థను విజయ్ దేవరకొండ ప్రారంభించారు.

    English summary
    Pelli Chupulu Fame Tarun Bhasker going to appear as hero. Vijaya Deverkonda is the producer for this movie. Anasuya is playing crucial role in this untitled movie. Now, Tarun Bhasker look goes viral in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X