తెలుగు జాతి అంటూ విడగొడతారా? మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానమిచ్చిన తేజ

బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం సీత. తేజ దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు. మే 24న విడుద‌లైంది. బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ నెగ‌టివ్ రోల్‌లో నటించారు.

చాలా మంది దర్శకులు ఇక్కడ మన తెలుగు వారికి అవకాశాలు ఇవ్వకుండా... బయటి భాషల నుంచి నటులను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనే వాదన ఉంది. 'సీత' ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఈ అంశం ప్రస్తావనకు రాగా మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానమిచ్చారు.

Director Teja about other state actors domination in Tollywood

''బయటి నుంచి అంటే వేరే దేశం కాదు కదా... ఇండియా నుంచే తీసుకుంటున్నాం. మనం అంతా ఇండియన్సే అయినపుడు ఇంకేంటి సమస్య? మీరు తెలుగు అని విడగొడుతున్నారా? ఇండియా నుంచి తెలుగు సపరేట్ జాతి అని విడగొట్టం చాలా తప్పు... అలా చేస్తే దేశ ద్రోహులు అంటారు.'' అంటూ తేజ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

''మనకు వేరే భాషవాడు తయారు చేసిన యాప్స్, కంప్యూటర్లు కావాలి. అమెరికా వాడు చేసిన కెమెరాలు కావాలి, జర్మనీవాడు చేసిన ఫిల్మ్స్ కావాలి.... అలా అనే వారు అన్నీ తెలుగు వాడు తయారు చేసినవే వాడండి. ఆ మాటకొస్తే మన సినిమాలు కూడా రిలీజ్ చేయూకూడదు. ఎందుకంటే స్క్రీన్ అమెరికా వాడు తయారు చేశాడు, లైట్లు జర్మనీ వాడు చేశాడు.'' అని తేజ చెప్పుకొచ్చారు.

Director Teja about other state actors domination in Tollywood

వి ఆర్ ఇండియన్స్, ఆందరూ ఒకటే. విడగొట్టే ప్రయత్నం చేయవద్దు. నేను వివాదం కోసం ఇలా మాట్లాడటం లేదు.. క్లియర్‌గా ఒక విషయం చెబుతాను. మనం కథ రాసుకుంటాం... అందులో రావణాసురుడి పాత్రకు 7 అడుగుల హైట్ ఉండే వ్యక్తి ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తీసుకొస్తాం. మన క్యారెక్టర్‌కు తగిన వాడిని తీసుకొస్తాం కానీ అతడు ఏ భాష, ఏ ప్రాంతం అని చూసి తీసుకురాం కదా... అని తేజ కౌంటర్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X